Viral Song: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పాత మెలోడీ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయ మాయ’ పాట ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ పాట పూర్తి లిరిక్స్, ఇతర వివరాలు మీకోసం.
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఏ పాత పాట ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయ మాయ’ అనే సాంగ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట హమ్మింగ్ వినిపిస్తోంది.
వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఆయుధం’ సినిమాలోని ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. దాదాపు 48 వేల మందికి పైగా ఈ పాటను లైక్ చేశారు. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా వేల సంఖ్యలో వీడియోలు ఈ పాటపైనే వస్తున్నాయి. చిన్ని చరణ్ రాసిన అద్భుతమైన సాహిత్యం, లెజెండరీ సింగర్ కుమార్ సాను, రష్మీల గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. పాత పాట అయినా, కొత్త అనుభూతిని ఇస్తుండటంతో నెటిజన్లు దీనికి ఫిదా అవుతున్నారు.