Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో

Published : Sep 25, 2026, 10:47 AM IST

Balakrishna: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపుకు.. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ కు బాలయ్య వార్నింగ్ ఏంటని షాక్ అవుతున్నారా? ఇదంతా చేసింది ఎవరో తెలుసా?

PREV
15
ట్రంప్ కు బాలయ్య మాస్ వార్నింగ్..

ప్రపంచ దేశాల మీద పెత్తనం చేయాలని కాలు దువ్వుతున్న అమెరికాకు బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ పై చాలా రోజులుగా యుద్ద చేస్తున్న అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు. అయితే బాలకృష్ణ ఇదంతా ఎందుకు చేస్తాడు..? అని డౌట్ వస్తుందికదా? అవును ఈ ప్లాన్ వేసింది ఎవరో కాదు ఇరాన్. ట్రంప్ కు గట్టిగా సమాధానం చెప్పేందుకు ఇరాన్ వినూత్నమైన, సినిమా తరహా మార్గాన్ని ఎంచుకుంది. ట్రంప్ చేసిన హెచ్చరికలను ఎద్దేవా చేస్తూ, జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iranian Embassy in Zimbabwe) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక తెలుగు సినిమా సన్నివేశాన్ని పంచుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

25
బాలకృష్ణ వీడియో షేర్ చేసిన ఇరాన్..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ తెలుగు మూవీ 'భగవంత్ కేసరి' లోని 58 సెకన్ల డ్యూరేషన్ ఉన్న యాక్షన్ వీడియోను ఇరాన్ ఎంబసీ షేర్ చేసింది. ఈ వీడియో క్లిప్‌లో ఇరువర్గాల మధ్య ఆయుధాలు, రైఫిళ్లు, దాడుల రక్షణ కవచాలతో గంభీరమైన ఘర్షణ వాతావరణం కనిపించే సీన్ ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ సినిమా క్లిప్‌ను ఒక కౌంటర్‌గా ఉపయోగించింది.

35
బెదిరింపులకు భయపడేది లేదు...

ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామంటూ గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ బెదిరింపులకు భయపడేది లేదని, తమ శక్తిసామర్థ్యాలు ఎలాంటివో నిరూపిస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ రాయబార కార్యాలయం ఈ హై-వోల్టేజ్ తెలుగు యాక్షన్ సీన్‌ను ఎంచుకుంది. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ పాత్ర ద్వారా వ్యక్తమయ్యే ఆవేశం, ధైర్యం , శత్రువులను ఎదుర్కొనే దృఢమైన వైఖరిని ఇరాన్ తమ దౌత్యపరమైన వైఖరికి ప్రతీకగా చూపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

45
అంతర్జాతీయంగా పెరుగుతున్న తెలుగు సినిమా స్థాయి..

ఈ ఘటనతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు చిత్రసీమ (టాలీవుడ్) స్థాయి అంతర్జాతీయ రాజకీయ దౌత్యంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఒక దేశ రాయబార కార్యాలయం తమ దౌత్యపరమైన విషయాన్ని ప్రదర్శించడానికి, ప్రపంచాన్ని శాసించగల శక్తి ఉన్న నాయకుడిని ఎద్దేవా చేయడానికి ఇలా భారతీయ సినిమా క్లిప్‌ను ఉపయోగించడం సాధారణం విషయం కాదు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది.

55
వైరల్ చేస్తున్న బాలయ్య అభిమానులు

సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. నందమూరి బాలకృష్ణ నటించిన సన్నివేశం ఈ రకంగా గ్లోబల్ పొలిటికల్ వేదికపై వైరల్ కావడం పట్ల తెలుగు సినిమా అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యాన్ని, ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వివాదాల్లో ఇలాంటి సినిమా డైలాగులు, సీన్లు చోటుచేసుకోవడం ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

Read more Photos on
click me!

Recommended Stories