నేను హీరోయిన్‌గా పనికిరాను.. `ఐటెమ్‌ గర్ల్` సంపాదనతోనే ఫ్యామిలీని పోషిస్తున్నాః రాఖీ సావంత్‌ బోల్డ్ కామెంట్‌

First Published May 18, 2021, 8:15 AM IST

తనకు హీరోయిన్‌ అయ్యే టాలెంట్‌ లేదని, అందుకు తాను పనికి రానని, ఐటెమ్‌ గర్ల్ గానే తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెబుతుంది బిగ్‌బాస్‌ బ్యూటీ రాఖీ సావంత్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది.  
 

రాఖీ సావంత్‌ అంటే బాలీవుడ్‌లో ఐటెమ్‌ గర్ల్‌ అనేదే గుర్తొస్తుంది. అంతగా తన అందాలతో, ఐటెమ్‌ సాంగ్‌లతో తనదైన ముద్ర వేసుకుంది. ఈ అమ్మడి లో దుస్తుల్లో స్టేజ్‌పై స్టెప్పులేస్తే బాలీవుడ్‌ ఆడియెన్స్ మొత్తం షేక్‌ అయిపోవాల్సిందే. థియేటర్లు పగిలిపోవాల్సిందే.
undefined
అంతగా తన డాన్సులతో, అందాలతో కనువిందు చేసింది రాఖీ సావంత్‌. ఈ అమ్మడు అవకాశం వచ్చినప్పుడల్లా అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. తన మత్తులోనే జోగేలా చేస్తుంటుంది. అదే సమయంలో కాంట్రావర్షిల్‌ కామెంట్స్, కాంట్రవర్షియల్‌ పనులతో తరచూ వార్తల్లో నిలుస్తుంది రాఖీ.
undefined
ఇటీవల బిగ్‌బాస్‌ 14లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన భర్తకి సంబంధించిన, తన గతానికి సంబంధించిన విషయాలను వెల్లడించి షాక్‌ ఇచ్చింది. అదే సమయంలో మోస్ట్ ఎంటర్‌టైనర్‌గానూ నిలిచింది. అందరి ప్రశంసలందుకుంది.
undefined
తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఐటెమ్‌ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నందుకు తనకు ఎలాంటి అభ్యంతరంగానీ, బాధగానీ లేదని వెల్లడించింది. `నాకు హీరోయిన్‌ పాత్ర పోషించేంత టాలెంట్‌ కూడా లేదు. బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరూ హీరోయిన్‌ కాలేరు. కొందరికి ఐటెమ్‌ గర్ల్‌లాగా ఛాన్సులొస్తే, మరికొందరికేమో తల్లిగా, చెల్లిగా, ఫ్రెండ్‌గా, నెగటివ్‌రోల్స్, అదికాకపోతే చిన్న చిన్న పాత్రలు వస్తుంటాయి.
undefined
`అయినా కెరీర్‌లో ఐటెం సాంగ్స్‌ చేయడం పట్ల నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే అలా సంపాదించిన డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఐటెం గర్ల్‌గా బాలీవుడ్‌లో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాను` అని వెల్లడించింది.
undefined
`మొహబత్‌ హై మిర్చి`, `దేక్తా హై తు క్యా` వంటి స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించిన రాఖీ తనదైన స్టయిల్‌ పర్‌ఫెర్మెన్స్, హంగామాతో గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు పాపులర్‌ అయ్యింది. `నాచ్‌ బలియే`, `పతి పత్ని జౌర్‌ వో`, `బిగ్‌బాస్‌` వంటి రియాలిటీ షోస్‌లో పాల్గొని మరింతగా పాపులర్‌ అయ్యింది రాఖీ.
undefined
click me!