కృష్ణ భగవాన్ ఆస్తి కొట్టేసేందుకు హైపర్ ఆది స్కెచ్‌.. `జబర్దస్త్` వదిలేశాక ఇలా.. చివరికి

Published : Aug 04, 2022, 10:10 AM ISTUpdated : Aug 04, 2022, 01:01 PM IST

హైపర్‌ ఆది పంచ్‌లో తెలుగు స్టేట్స్ లోనే ఫేమస్‌. పంచ్‌లకు కేరాఫ్‌ అంటూ ఆయనే గుర్తొస్తారు. `జబర్దస్త్`, `ఢీ` షోలో ఆయన చేసిన రచ్చ ఏంటో అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆస్తి కోసం రూట్‌ మార్చాడు.   

PREV
18
కృష్ణ భగవాన్ ఆస్తి కొట్టేసేందుకు హైపర్ ఆది స్కెచ్‌.. `జబర్దస్త్` వదిలేశాక  ఇలా.. చివరికి
Photo Credit Sridevi Drama Company Latest Promo

తనదైన కామెడీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హైపర్‌ ఆది. ముఖ్యంగా పంచ్‌ డైలాగ్‌లకు ఆయన చాలా ఫేమస్‌ అయ్యారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు, కామెడీ పంచ్‌లతో అదరగొడుతూ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గారాణిస్తున్నారు. తాజాగా హైపర్‌ ఆది రూట్‌ మార్చినట్టు కనిపిస్తుంది. ఆస్తి కోసం మిరపకాయ్‌ కూడా తినేందుకు సిద్ధమవడం విశేషం. 
 

28
Photo Credit Sridevi Drama Company Latest Promo

టాలీవుడ్‌లో ఒకప్పుడు కమెడియన్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణభగవాన్‌. సైలెంట్‌గా డైలాగ్‌లు పేలుస్తూ నవ్వులు పూయించేవారు. ఆయన కామెడీ స్టయిల్‌ చాలా స్పెషల్‌. అందుకే పదేళ్ల క్రితం ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో బుల్లితెరపై అడపాదడపా మెరుస్తున్నారు. 

38
Photo Credit Sridevi Drama Company Latest Promo

ప్రస్తుతం ఆయన `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో నవ్వులు పూయించేందుకు వచ్చారు. అందులో భాగంగా తన వంద కోట్ల ఆస్తిని చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు, కూతురుకి వస్తే వారి పేరిటి రాయిస్తానని చెబుతారు.అందుకోసం ప్రకటన ఇవ్వగా, చాలా మంది తాము మీ కుమారుడు, కూతురు అంటూ వస్తుంటారు. 

48
Photo Credit Sridevi Drama Company Latest Promo

మొదట హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ వచ్చారు. నాన్నగారు నేనే మీ కొడుకుని అంటూ హైపర్‌ ఆది అనగా, కాదు నేనే మీ కొడుకుని అని రాంప్రసాద్‌ సైతం పోటీకొచ్చారు. అది చూసి ఆశ్చర్యపోయిన కృష్ణభగవాన్‌.. తనదైన స్టయిల్‌ డైలాగ్‌ విసిరారు. `బాబూ తప్పిపోయింది నా కొడుకులు.. దొంగనా కొడుకులు కాదు` అని చెప్పడంతో ఆది, రాంప్రసాద్‌కి దిమ్మతిరిగిపోయింది. 

58
Photo Credit Sridevi Drama Company Latest Promo

ఈ సందర్భంగా ఆది..నాన్నగారు మీకు పాపారావు(కృష్ణభగవాన్‌) అనే పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించగా, అప్పట్లో ప్రతి పాపని రావా రావా అనేవాడిని అని చెప్పడంతో షోలో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత వర్ష వచ్చి `నాన్న గుర్తు పెట్టుకో.. చిన్నప్పుడు నేను `అని చెప్పబోతున్న సమయంలోనే ఈయనే నా కొడుకు అని వర్షని పట్టుకుని కృష్ణభగవాన్‌ చెప్పడంతో మరోసారి షో మొత్తం ఘోల్లుమని నవ్వులు పూయించింది.

68
Photo Credit Sridevi Drama Company Latest Promo

వీరితోపాటు ఇమ్మాన్యుయెల్‌, ప్రసాద్‌, ఫైమా, వర్ష ఇలా అందరు జబర్దస్త్ కమెడియన్లు తామే మీ కుమారుడు, కూతురంటూ వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణభగవాన్‌ వారిపై వేసిన పంచ్‌ డైలాగులు నవ్వులు పూయించాయి. అంతేకాదు తన కొడుకు, కూతురెవరో తేల్చేందుకు పచ్చి మిరపకాయలు తినే పోటీ పెట్టారు.పది మిరపకాయలు ఎవరు తింటే వారే కూతురు, కొడుకు అని చెబుతారు. 

78
Photo Credit Sridevi Drama Company Latest Promo

వర్ష, ఫైమా, కొమురంతోపాటు హైపర్‌ ఆది, ఇమ్మాన్యుయెల్‌, రాంప్రసాద్‌, నరేష్‌ వీరంతా పచ్చిమిరపకాయలు తీనేందుకు కూర్చున్నారు. ఒక్క మిరపకాయ్‌ తిన్న హైపర్‌ ఆది.. ఆ మంట తట్టుకోలేక.. `నాకసలు తండ్రి లేడు. నేను ఎవరి కొడుకుని కాదు. అని చెప్పడంతో యాంకర్‌ రష్మి.. వంద కోట్ల అస్తి అని గుర్తు చేస్తుంది. అయినా ఆ మంట తట్టుకోలేక `అసలు నా కొడుకులు అనే ఈవెంట్‌లో నేను లేను` అని హైపర్‌ ఆది వెళ్లిపోవడం ఆద్యంతం నవ్వులు పూయించింది. 
 

88
Photo Credit Sridevi Drama Company Latest Promo

దీంతోపాటు వంగుడు దూకుడు కార్యక్రమం పెట్టారు. అది కూడా ఆద్యంతం కామెడీని పంచడం విశేషం. `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమోలోని కామెడీ సన్నివేశాలివి. తాజాగా విడుదలైన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇది వచ్చే ఆదివారం ఈటీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఇందులో కృష్ణభగవాన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలవనుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories