హైపర్‌ ఆది గిఫ్ట్ చూసి బోరున విలపించిన యాంకర్‌ సౌమ్యరావు.. క్యాన్సర్‌తో మూడేళ్లు బెడ్‌పై అమ్మ అంటూ కన్నీళ్లు

Published : Jul 07, 2023, 08:39 PM IST

హైపర్‌ ఆది.. జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు చేత కన్నీళ్లు పెట్టించారు. ఆమెకి గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చారు. అది చూసి సౌమ్యరావు బోరున విలపించడం ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షో మొత్తం ఒక్కసారిగా గుంబనంగా మారిపోయింది.   

PREV
15
హైపర్‌ ఆది గిఫ్ట్ చూసి బోరున విలపించిన యాంకర్‌ సౌమ్యరావు.. క్యాన్సర్‌తో మూడేళ్లు బెడ్‌పై అమ్మ అంటూ కన్నీళ్లు

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు షోలో ఎంతో చలాకీగా ఉంటారు. పంచ్‌లతో, తనపై వేసే పంచ్‌లకు కౌంటర్లు, వచ్చీ రానీ డాన్సులతో ఆకట్టుకుంటుంది. దీనికితోడు స్లిమ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. ఎప్పుడూ నవ్వించే యాంకర్‌ సౌమ్య రావు.. రష్మి షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. హైపర్‌ ఆది ఇచ్చిన గిఫ్ట్ ని చూసి ఆమె ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు.
 

25

రష్మి గౌతమ్‌ యాంకర్‌గా వ్యవహరించే `శ్రీదేవీ డ్రామా కంపెనీ` షోలో జబర్దస్త్ కమెడియన్లు, జడ్జ్‌ ఇంద్రజ, యాంకర్‌ సౌమ్య రావు సైతం పాల్గొన్నారు. ఎప్పటిలాగే వివిధ రకాల స్కిట్లు, ప్రోగ్రామ్‌లతో నవ్వులు పూయించారు. పెళ్లిచూపులు, పెళ్లిళ్లకి సంబంధించిన స్కిట్‌ నవ్వులు పూయించారు. అనంతరం హైపర్‌ ఆది.. సౌమ్య రావు కోసం ఓ గిఫ్ట్ తెచ్చానంటూ ఆమెకి ఇచ్చారు. 
 

35

హైపర్‌ ఆది ఇచ్చిన గిఫ్ట్ చూసిన సౌమ్య రావు మొదట ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏముంది ఇందులో ఆమె అడగ్గా, నీకైతే చాలా బాగా నచ్చుతుందని చెప్పాడు ఆది. ఆ తర్వాత ఆ గిఫ్ట్ విప్పి చూశాక మాత్రం ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యింది. అది తన అమ్మ ఫోటో ఫ్రేమ్‌. అమ్మని చూసుకుని, అమ్మని తలచుకుని ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యింది సౌమ్య రావు. అందరి ముందే స్టేజ్‌పైనే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 

45

మరోవైపు ఆసుపత్రిలో అమ్మ ఉన్న సమయంలో తీసిన వీడియోని షోలో చూపించగా, మరింతగా ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా అమ్మని తలుచుకుంది సౌమ్య రావు. అమ్మకి చాలా హెడేక్‌ వచ్చేది. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని చెప్పారు. ఆ సమయంలో అమ్మ అన్నీ మర్చిపోయింది. నన్ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయింది. 

55

ఆసుపత్రి బెడ్‌పైనే అమ్మ మూడున్నరేళ్ల పాటు ఉందని, కోలుకుంటుందని అనుకున్నా, అది జరగలేదని, బెడ్‌పై అమ్మకి దేవుడి ఇలాంటి దారుణమైన పరిస్థితి తీసుకొస్తాడని ఊహించలేదని బోరున విలపించింది సౌమ్య రావు. అంతేకాదు మరో ఎమోషనల్‌ వర్డ్స్ వాడింది. అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఇది చూసి షోలో ఉన్న వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకోవడంతో షో మొత్తం గుంబనంగా మారిపోయింది. ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఇది ఆదివారం ఈటీవీలో ప్రసారం కానుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories