Jabardasth: జబర్దస్త్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్... షోకి గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది! 

First Published May 23, 2022, 11:38 AM IST

మెజారిటీ కమెడియన్స్ జబర్దస్త్ (Jabardasth) షోకి దూరమైనా... హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్ లు ప్రేక్షకులు ఎటువంటి లోటు లేకుండా వినోదం పంచుతూ వస్తున్నారు. జబర్దస్త్ కి హైపర్ ఆది, ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ ప్రత్యేక ఆకర్షణ. 
 

Jabardasth

ఈ రెండు టీమ్ స్కిట్స్ కోసమే ఈ షోలను చూసే ప్రేక్షకులు ఉండారంటే అతిశయోక్తి కాదు. ఆది నాన్ స్టాప్ పంచ్ లకు ఫేమస్ కాగా... సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) టీమ్ లో కామెడీ టైమింగ్, గెటప్ శ్రీను వేషాలు, రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు పిచ్చ ఫేమస్. 
 

Jabardasth

ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, అప్పారావు వంటి కమెడియన్స్ షోని వీడినప్పటికీ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ రెండు షోలను తమ భుజాలపై మోస్తూ నెట్టుకొస్తున్నారు. దాదాపు పదేళ్ల ప్రస్థానంలో జబర్ధస్త్ షో వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అత్యధిక టీఆర్పీ కలిగిన షోగా రికార్డులను బ్రేక్ చేసింది. 
 

Jabardasth


కాగా హైపర్ ఆది,(Hyper Aadi) సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వదిలేసినట్లు తెలుస్తుంది. ఇకపై వీరిద్దరూ షోలో కనిపించే ఆస్కారం లేదంటున్నారు. కొన్ని వారాలుగా హైపర్ ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. అలాగే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లేకుండానే గత ఎపిసోడ్ లో రాంప్రసాద్ స్కిట్ చేశారు.
 

Jabardasth

 
ఈ షో హైపర్ ఆది, సుధీర్ లను స్టార్స్ చేసింది. వెండితెరపై వీళ్లకు అవకాశాలు విరివిగా వస్తున్నాయి. హైపర్ ఆదికి కామెడీ రోల్స్ దక్కుతున్నాయి. సుధీర్ అయితే ఏకంగా హీరోగా చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాలు విడుదలయ్యాయి. మరో మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. 
 

Jabardasth


ఈ కారణంగానే ఈ స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ షోకి దూరమైనట్లు తెలుస్తుంది. అలాగే రెమ్యూనరేషన్స్ కూడా ఓ కారణంగా తెలుస్తోంది.  వీరిద్దరూ లేకపోవడం జబర్దస్త్ కి చాలా పెద్ద లోటు. ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గెటప్ శ్రీను కూడా గుడ్ బై చెప్పేశాడట. 
 

Jabardasth

ఈ షోకి ప్రత్యేకత తీసుకొచ్చిన స్టార్స్ ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. నాగబాబు 2019లో షోని వీడగా.. మంత్రి పదవి రావడంతో ఇటీవల రోజా జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ షోలో పెర్ఫార్మ్ చేస్తున్న టీమ్స్ లో చాలా కొత్తవే అని చెప్పాలి. ఈ టీమ్స్ మునుపటి కమెడియన్స్ మాదిరి నవ్వులు పూయించలేకపోతున్నారు. మొత్తంగా ఒకప్పుడు తిరుగులేకుండా వెలిగిపోయిన జబర్దస్త్ షోకి కష్టకాలం వచ్చింది. 
 

click me!