జబర్దస్త్ కొత్త యాంకర్ పై హైపర్ ఆది ఆరోపణలు... ఆమె కారణంగానే షో మానేశానంటూ షాకింగ్ కామెంట్స్ 

Published : Jan 13, 2023, 03:33 PM IST

సౌమ్యరావు కారణంగానే జబర్దస్త్ షో మానేశానని హైపర్ ఆది చెప్పడం బుల్లితెర వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొత్తగా వచ్చిన సౌమ్యరావుని హైపర్ ఆది టార్గెట్ చేశారేంటి అంటున్నారు.   

PREV
16
జబర్దస్త్ కొత్త యాంకర్ పై హైపర్ ఆది ఆరోపణలు... ఆమె కారణంగానే షో మానేశానంటూ షాకింగ్ కామెంట్స్ 
Hyper Aadi-Sowmya Rao

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు రెండు టీములే ఆధారం. హైపర్ ఆది జబర్దస్త్ కి కీలకం కాగా, ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీమ్ మెయిన్. మిగతా టీమ్స్ కామెడీ పంచినప్పటికీ ఈ టీమ్స్ తో పోటీపడలేరు. ఇవి విచ్ఛిన్నం కావడంతో ఆదరణ తగ్గింది. 
 

26
Hyper Aadi-Sowmya Rao

చాలా రోజులు జబర్దస్త్ వదిలేసిన హైపర్ ఆది రీఎంట్రీ ఇచ్చాడు. మరలా ఆయన మానేసినట్లు తెలుస్తుంది. జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చాయి. అదిరింది షోలో చేసిన సద్దాం-యాదమ్మ రాజు కలిసి ఒక టీమ్ గా చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన హైపర్ ఆది పూర్తిగా జబర్దస్త్ కి దూరమయ్యారు. 
 

36
Hyper Aadi-Sowmya Rao

అయితే తాను జబర్దస్త్ వదిలేయడానికి కారణం యాంకర్ సౌమ్యనే అంటూ హైపర్ ఆది ఓ ఆరోపణ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం సంక్రాంతి ఎపిసోడ్ రూపొందించారు. జనవరి 15న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది . హైపర్ ఆది పెదరాయుడు మూవీ స్పూఫ్ తో ఒక స్కిట్ చేశాడు. స్కిట్ అనంతరం, యాంకర్ రష్మీ... ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు.

46
Hyper Aadi-Sowmya Rao

స్క్రీన్ పై ముగ్గురి ఫోటోలు వేసి... వీరిలో ఎవరి కారణంగా మీరు జబర్దస్త్ మానేశారో చెప్పాలని అడిగారు. హైపర్ ఆది తడుముకోకుండా, నేను ఆమె కారణంగానే జబర్దస్త్ మానేశానంటూ సౌమ్య రావు ఫోటో వైపు చూపించాడు. దాంతో వేదికపై ఉన్న జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మీ షాక్ అయ్యారు. 

56
Hyper Aadi-Sowmya Rao


ఆది అంత పెద్ద ఆరోపణ చేయడం వెనుక కారణం ఏమిటీ? ఇది కేవలం కామెడీలో భాగమా? లేక సీరియస్ గానే ఈ ఆరోపణలు చేశాడా? అనేది తెలియాలంటే వచ్చే ఆదివారం పూర్తి ఎపిసోడ్ చూడాలి. నిజానికి హైపర్ ఆది కారణంగా సౌమ్యరావు షో మానేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. చివరికి హైపర్ ఆది అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

66
Hyper Aadi-Sowmya Rao


హైపర్ ఆది మంచి కమెడియన్ అయినప్పటికీ పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. కామెడీ పేరుతో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కొందరు  మనోభావాలు దెబ్బతిన్నాయి. హైపర్ ఆది చాలాసార్లు బహిరంగ క్షమాపణలు కోరారు. తన షోలోని యాంకర్స్, జడ్జెస్ ని కూడా వదలకుండా ఆది టార్గెట్ చేస్తాడు. అనసూయ కమెడియన్స్ కారణంగా బాడీ షేమింగ్ కి గురయ్యానని చెప్పడం విశేషం. 

Read more Photos on
click me!

Recommended Stories