ప్రేమించిన అమ్మాయిని అందరికి పరిచయం చేసిన హైపర్‌ ఆది.. ఇన్నాళ్లకు తోడు దొరికిందిగా.. చిలిపి ముద్దులతో రచ్చ

Published : Aug 14, 2023, 09:41 PM IST

`జబర్దస్త్` కమెడియన్‌ హైపర్‌ ఆది అన్నంత పని చేశాడు. ఇన్నాళ్లుగా రూమర్లకే పరిమితమైన ఆయన ప్రేమ కథకి ఓ ముగింపు పలికారు. తాజాగా తన ప్రియురాలిని అందరికి పరిచయం చేసి పెద్ద షాకిచ్చాడు ఆది. 

PREV
16
ప్రేమించిన అమ్మాయిని అందరికి పరిచయం చేసిన హైపర్‌ ఆది.. ఇన్నాళ్లకు తోడు దొరికిందిగా.. చిలిపి ముద్దులతో రచ్చ

జబర్దస్త్ కమెడియన్ గా బాగా పాపులర్‌ అయ్యాడు హైపర్‌ ఆది. ఆ తర్వాత టీవీ షోస్‌లలో సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు `ఢీ` షో, మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సందడి చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. తనదైన పంచులతో షోకి హైలైట్‌గా నిలుస్తున్నారు. బుల్లితెరపై మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా పేరుతెచ్చుకుంటున్నా ఆది సినిమాల్లోనూ రాణిస్తున్నారు. 
 

26

అయితే హైపర్‌ ఆది పెళ్లి, ప్రేమ విషయాలు చాలా సార్లు హాట్ టాపిక్‌ అయ్యాయి. అదిగో లవర్‌ ఇదిగో లవర్‌ అంటూ ప్రచారం జరుగుతూ వచ్చేది. ఆ అమ్మాయితో ఆది పెళ్లి, ఆది చేసుకునే అమ్మాయి ఈమెనే అంటూ రూమర్స్ వచ్చాయి. అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఓ క్రమంలో యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌తోనూ పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. ఇటీవల అవి బాగా ఎక్కువవయ్యాయి. దీనిపై వర్షిణి స్పందించి క్లారిటీ ఇచ్చింది. అలాంటివేమీ లేవని తెలిపింది. అది నిజం కాదని పేర్కొంది. 
 

36

ఆమె చెప్పిన నెక్ట్స్ డేనే తన ప్రియురాలిని పరిచయం చేశారు హైపర్‌ ఆది. టీవీ షో వేదికగా ఆయన తన లవర్‌ని పరిచయం చేయడం విశేషం. `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో తాను ప్రేమించిన అమ్మాయి ఈమెనే అంటూ వెల్లడించారు. యాంకర్‌ రష్మి యాంకర్‌గా ప్రసారం అవుతున్న ఈ షోలో తన ప్రియురాలిని అందరికి పరిచయం చేశాడు ఆది. ఇద్దరు కలిసి స్టేజ్‌పై నవ్వులు చిందించారు. 
 

46

అంతేకాదు షో వేదికగా తన లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఆయన ప్రేమని ఆమె కూడా స్వీకరించడం విశేషం. ఈ సందర్భంగా తన లవ్‌ పేరు చెప్పారు ఆది. `ఐ లవ్యూ విహారిక` అని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లవ్‌ పిల్లోని గిఫ్ట్ గా ఇచ్చారు. దాన్ని స్వీకరించిన విహారిక(ని) తనకు లవ్యూ టూ చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు ప్రేమించుకున్న తీరు ముచ్చటగా ఉంది. దీనికి అంతా హో ఏసుకోవడం విశేషం. షో వాళ్లు `ఖుషి` సాంగ్‌తో రచ్చ రచ్చ చేశారు. 

56

అంతటితో ఆగలేదు... యాంకర్ రష్మి సలహా మేరకు ఇద్దరు బుగ్గులు తీసుకుని ముద్దులు పెట్టుకున్నారు. మొదట హైపర్‌ ఆది.. తన ప్రియురాలి బుగ్గని తీసుకుని ముద్దు పెట్టుకోగా, ఆ తర్వాత విహారిక కూడా ఆది రెండు బుగ్గలను చేతులతో తీసుకుని ముద్దు పెట్టుకోవడం విశేషం. ఇది షోలో హైలైట్‌గా నిలిచింది. దీనిపై అంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్లు చేసిన పనికి జెలసీకిగా ఫీలయ్యారు. మొత్తంగా వీరి ఎపిసోడ్‌ షోలో హైలైట్‌గా నిలిచింది. 

66

ఇదిలా ఉంటే విహారిక ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా? లేక బయటి అమ్మాయా? అనేది తెలియాల్సి ఉంది. కానీ హైపర్‌ ఆది లవర్‌ని పరిచయం చేయడమనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` షో ప్రోమోలోని అంశమిది. ఈ ప్రోమో ట్రెండ్‌ అవుతుంది.  అదే సమయంలో ఇందులో నిజమెంతా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. జనరల్‌గా ఇలాంటి షోస్‌లో రేటింగ్‌ కోసం ఇలాంటివి క్రియేట్‌ చేస్తుంటారు. చివరికి కామెడీతో ముగిస్తారు. మరి ఆది పరిచయం చేసిన ప్రేమ నిజమేనా? చివరికి కామెడీ చేస్తారా? అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories