బ్లాక్ అండ్ వైట్ లో శృతి హాసన్.. స్టార్ హీరోయిన్ కిల్లింగ్ లుక్స్.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Aug 14, 2023, 7:07 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan)  ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. లోకనాయకుడు, తమిళ స్టార్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. స్టార్ హీరోయిన్ గా మారింది. 
 

ప్రస్తుతం బడా హీరోలకు జోడీగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. చిరు సరసన ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో మంచి రిజల్ట్స్ ను సొంతం చేసుకుంది. 
 


ఇదిలా ఉంటే.. వెండితెరపైనే కాకుండా శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఎప్పడికప్పుడు తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వస్తుంటుంది.

అలాగే, బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలోనూ ఫొటోషూట్లు చేస్తూ వస్తుంటుంది. కొంత కాలంగా గ్లామర్ షో ఆపేసిన శృతి హాసన్ డిఫరెంట్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. 
 

తాజాగా తన అభిమానులతో పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో శృతి హాసన్ కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టైలిష్ అండ్ కిల్లింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. నిజానికి శృతి డ్రెస్సింగ్ సెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

మరోవైపు శృతి టెంప్టింగ్ ఫోజులతోనూ కట్టిపడేసింది. మత్తు చూపులు, మతులుపోయేలా స్టిల్స్ ఇచ్చి మైమరిపించింది. ఇక శృతి హాసన్ నయా లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
 

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గానూ శృతి హాసన్ దుమ్ములేపుతోంది. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’లోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!