
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో కలిసి నటించింది టాలీవుడ్‌లో కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది సమీరారెడ్డి. ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా టాలీవుడ్‌కి దూరమయ్యింది. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సమీరా రెడ్డి.. పెళ్లి సమయంలో అనేక అవమానాలను ఫేస్ చేసిందట. తాజాగా ఆమె ఓపెన్ అయ్యింది.
సమీరా రెడ్డి.. పెళ్లి చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ కావడం కారణంగానే హడావుడిగా పెళ్లి చేసుకుందని కామెంట్ చేశారని తెలిపింది సమీరారెడ్డి. అంతేకాదు మొదటి ప్రెగ్నెంట్ తర్వాత తన బాడీషేమింగ్ కామెంట్స్ వచ్చాయట. అవి తనని చాలా బాధించాయని చెప్పింది. చివరికి కూరగాయలు అమ్మేవాడు కూడా తన బాడీపై కామెంట్ చేసినట్టు చెప్పింది సమీరా రెడ్డి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిసింది.
ఆమె చెబుతూ, తన పెళ్లి విషయంలో చాలా రకాల కామెంట్లు ఎదుర్కొన్నానని చెప్పింది. 2014లో అక్షయ్‌తో తన పెళ్లి జరిగిందని, తమ ఇంటి టెర్రస్ పైనే సింపుల్‌గా వివాహం చేసుకున్నామని చెప్పింది సమీరా రెడ్డి. అయితే ఆ విషయంలోనే విమర్శలు వచ్చాయని తెలిపింది. తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకుందని చాలా మంది కామెంట్ చేశారని, అవన్నీ తనని చాలా బాధించాయని పేర్కొంది సమీరా రెడ్డి. కానీ ఆ కామెంట్స్ లో నిజం లేదని, తాను పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది.
అయితే తొలి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పింది. ఓ వైపు ఆరోగ్య సమస్యలే కాదు, మరోవైపు ట్రోల్స్ కూడా ఫేస్ చేశానని, బాడీ షేమింగ్ కామెంట్లని ఎదుర్కొన్నట్టు తెలిపింది. తన కుమారుడు హన్స్ కి జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతరం బ్లూస్ వచ్చాయని, దీంతో బరువు పెరిగిందట. దీంతో తన బాడీలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొంది. ఆ సమయంలో కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా తనని కామెంట్ చేశాడని పేర్కొంది.
`మీకు ఏమైంది మేడమ్ ఇలా ఉన్నారు`, `అసలు ఇది నువ్వేలా ?`, మీరు కొంచె మారిపోయారు` అంటూ కామెంట్ చేశాడట. అది తనని చాలా బాధించిందని, చాలా రోజులు బాధపడినట్టు తెలిపింది. అంతేకాదు అలాంటి కామెంట్లతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయం వేసిందని, ఆ వ్యాఖ్యలు తనపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని తెలిపింది. ఆ టైమ్‌లో బాగా ఇబ్బంది పడినట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోనని, తనని ఎవరు ఎలా చూస్తున్నారనేది తనకు అవసరం లేదన్నారు. తన పని తాను చేసుకుని వెళ్లిపోతానని పేర్కొంది.
టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమీరా రెడ్డి. బొద్దు అందాలతో మెస్మరైజ్ చేసింది. గ్లామర్ డోస్‌తో ఆడియెన్స్ కి చెమటలు పట్టించింది. `నరసింహుడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హాట్ బ్యూటీ. ఎన్టీఆర్‌తో కలిసి నటించి అలరించింది. ఆ తర్వాత ఈ భామ చిరంజీవితో `జై చిరంజీవ` చేసింది. ఎన్టీఆర్ తో మరోసారి జోడీ కడుతూ `అశోక్`లో నటించింది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. హిందీలోనే విజయాలతోపాటు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. 2015లో కుమారుడు హన్స్‌కు, 2019లో కుమార్తె నైరాకు జన్మనిచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వంటల వీడియోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.