టీకాలు వేయించాల్సిన వయసులో టాటూలు అవసరమా.. ప్రగతిపై హైపర్ ఆది సెటైర్లు

Published : Aug 21, 2022, 10:57 AM IST

జబర్దస్త్, ఢీ 14 టీం మెంబర్స్ కలసి వినాయక చవితికి ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు మనవూరి దేవుడు. వినాయక చవితి రోజున ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.

PREV
16
టీకాలు వేయించాల్సిన వయసులో టాటూలు అవసరమా.. ప్రగతిపై హైపర్ ఆది సెటైర్లు

జబర్దస్త్, ఢీ 14 టీం మెంబర్స్ కలసి వినాయక చవితికి ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు మనవూరి దేవుడు. వినాయక చవితి రోజున ఈ ఈవెంట్ ప్రసారం కానుంది. హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష, ఇంద్రజ, ఖుష్బూ, ప్రగతి తో పాటు నటులు కృష్ణ భగవాన్, నాగినీడు కూడా పాల్గొన్నారు. 

26

తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. జబర్దస్త్ టీం అంతా గణేష్ ఉత్సవాల్లో భాగంగా బురదలో కబడ్డీ ఆడుతున్నారు. బురదలో ఒకరిపై ఒకరు పడడం.. ఒళ్ళంతా బురదతో చేసే కామెడీ చేష్టలు నవ్వించే విధంగా ఉన్నాయి. నరేష్.. ఇమ్మాన్యూల్ ముఖాన బురద కొట్టడం ఫన్నీగా ఉంది. 

36

నటి ప్రగతి లంగా ఓణీ లో చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. మాచర్ల నియోజకవర్గం మూవీ ఐటెం సాంగ్ కి ప్రగతి ఊగిపోతూ డాన్స్ చేసింది. డాన్స్ పెర్ఫామెన్స్ అనంతరం ప్రగతి మరో కాస్ట్యూమ్ లో శారీ ధరించి కనిపించింది. ప్రగతి, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, ఇంద్రజ కలిసి సరదాగా ఓ స్కిట్ చేశారు. 

46

ఈ స్కిట్ లో హైపర్ ఆది ప్రగతి మనవడిగా నటించడం విశేషం. ప్రగతి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కండలు చూపిస్తోంది. నాయనమ్మా మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటి అని సెటైర్ వేశాడు. పిల్లల్ని పెంచాల్సిన వయసులో కండలు పెంచుతోంది అని చెప్పడంతో నవ్వులు పూశాయి. 

56

అనంతరం అవుట్ డోర్ లో హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, వర్ష చేసిన స్టంట్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. వర్ష ప్రేమ కోసం ఇమ్మాన్యూల్ తన చేతులపై కార్లు ఎక్కించుకుంటాడు. ప్రేమ కోసం నువ్వు కూడా కార్లు ఎక్కించుకో అని వర్షని కూడా బలవంతం చేస్తాడు. దీనితో వర్ష కూడా చేతులపై కార్లు ఎక్కించుకుంటుంది. 

66

ట్యూబ్ లైట్స్ తో మరో స్టంట్ చేశారు. ట్యూబ్ లైట్స్ ని శరీరంపై పగలగొట్టుకోవాలి అని హైపర్ ఆది చెబుతాడు. ఇది చాలా రిస్క్ వద్దు అని వర్ష అంటుంది. చాలా సులభం అంటూ ఒక ట్యూబ్ లైట్ ని ఇమ్మాన్యూల్ వీపుపై పగలగొడతాడు ఆది. దీనితో ఇమ్మాన్యూల్ కి గాయం అవుతుంది. దీనితో మా ఇమ్మూనే కొడతావా అంటూ హైపర్ ఆది వీపు పగలగొడుతుంది. వెంటనే ఆది కూడా వర్ష వీపుపై ట్యూబ్ లైట్ పగలగొడతాడు. డాన్స్, కామెడీ, స్టంట్స్ తో మా ఊరి దేవుడు ఈవెంట్ రసవత్తరంగా సాగినట్లు ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories