పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే అవుతా.. పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన హైపర్ ఆది, పోటీ ఎక్కడి నుండి?

Published : Feb 14, 2024, 07:33 AM ISTUpdated : Feb 14, 2024, 08:25 AM IST

పవన్ కళ్యాణ్ వీర విధేయుడైన హైపర్ ఆది తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ విశ్వాసం ప్రకటించాడు. అదే సమయంలో మంత్రి రోజాతో విభేదాలపై ఓపెన్ అయ్యారు.   

PREV
17
పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే అవుతా.. పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన హైపర్ ఆది, పోటీ ఎక్కడి నుండి?


ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాగా జబర్దస్త్ మాజీ కమెడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. జనసేన సానుభూతి పరుడైన ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందంటూ కథనాలు వెలువడ్డాయి. 

 

27

జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో హైపర్ ఆది పాల్గొన్నాడు. సభల్లో రాజకీయ ప్రసంగాలతో హోరెత్తించాడు. మొదటిసారి ఆయన నేరుగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 

37

ఆయన మాట్లాడుతూ... ప్రొఫెషన్ వేరు పాలిటిక్స్ వేరు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే జబర్దస్త్ కారణం. రోజా మేడంతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. జబర్దస్త్ సెట్స్ లో ఆమె పాలిటిక్స్ మాట్లాడేవారు కాదు. నాగబాబు మాదిరే ఆమె కూడా ప్రోత్సహించారు. 
 

47
Hyper Aadi

ఆమె ఇష్టపడే వ్యక్తులు వేరు, నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయనతో నడుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే నేను రియాక్ట్ అవుతాను. ఆయన వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరు. సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారు.

57
Hyper aadi , PawanKalyan

పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటాను. నేను పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు మద్దతు తెలపడం లేదు.ఒకవేళ  నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఆయన్ని గెలిపించడం కోసం గెలుస్తాను. ఈసారి కూడా జనసేన తరపున నేను క్యాంపైన్ చేయడానికి వెళతాను... అని అన్నారు. 

67

హైపర్ ఆది మాటలను పరిశీలిస్తే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సిద్ధం. జనసేన టికెట్ ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానని చెప్పారు. అయితే జనసేన ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉంది. జనసేన పార్టీకి టీడీపీ ఇచ్చే కొద్ది సీట్లల్లో హైపర్ ఆదికి ఒకటి ఇవ్వడం అసాధ్యం. 
 

77

మరోవైపు హైపర్ ఆది నటుడిగా పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నాడు. బుల్లితెర మీద ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో సందడి చేస్తున్నారు. కెరీర్ పరంగా ఆయన ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories