జాబ్ చేస్తే వడ్డీలకు కూడా సరిపోయేది కాదు, పొలం అమ్ముకున్నాం.. హీరోగా, దర్శకుడిగా మారేది ఎప్పుడంటే

Published : Dec 01, 2023, 06:38 PM IST

కంప్లీట్ స్క్రిప్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు నాకున్న కమిట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తేనే అది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న పనులు పక్కన పెట్టలేను. కాబట్టి దానికి కూడా ఒక టైమ్ వస్తుంది అని అనుకుంటున్నా. బలగం వేణు అన్న డైరెక్టర్ కావడానికి దాదాపు 9 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యారు. 

PREV
16
జాబ్ చేస్తే వడ్డీలకు కూడా సరిపోయేది కాదు, పొలం అమ్ముకున్నాం.. హీరోగా, దర్శకుడిగా మారేది ఎప్పుడంటే

కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు. హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్ తో పాటు గ్లామర్ ముద్దు గుమ్మలని ఇరకాటంలో పెట్టే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటాడు. 

26

సినిమాలకి స్పూఫ్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన హైపర్ ఆది.. ఆ తర్వాత జబర్దస్త్ తో వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, ఫ్యామిలీ గురించి అనేక విషయాలు పంచుకున్నాడు. 

36

తమ తల్లిదండ్రులు తాము ముగ్గురు అన్నదమ్ములం సంతానం అని హైపర్ ఆది తెలిపాడు. మా చదువులకే నాన్న 20 లక్షల వరకు అప్పు చేశారు. నేను జాబ్ చేస్తుంటే ఆ డబ్బు వడ్డీలకు కూడా సరిపోయేది కాదు. ఒకరివద్ద మాటలు పడి బతకడం కష్టం. దీనితో మూడు ఎకరాలు అమ్మేసి అప్పులు తీర్చాం. పొలం అమ్ముకోవడం అంత సులభమైన విషయం కాదు. 

46

ఇక నటన నాకు మా నాన్న నుంచే వచ్చిందేమో. ఆయన నాటకాలు వేసేవారు. అలా నాకు కూడా వీడియోలు చేయడం, కామెడీ చేయడం అలవాటైంది అని హైపర్ ఆది తెలిపాడు. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి ఒకే.. కానీ రైటర్ గా పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ చేయడం, హీరోగా నటించడం ఎప్పుడు చేస్తావు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా హైపర్ ఆది ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

56

కంప్లీట్ స్క్రిప్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు నాకున్న కమిట్మెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తేనే అది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న పనులు పక్కన పెట్టలేను. కాబట్టి దానికి కూడా ఒక టైమ్ వస్తుంది అని అనుకుంటున్నా. ఇక హీరోగా నటించే ఆలోచనే నాకు ఎప్పుడూ రాలేదు. బలగం వేణు అన్న డైరెక్టర్ కావడానికి దాదాపు 9 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యారు. 

66

దిల్ రాజు దగ్గరే నాలుగేళ్లపాటు తిరిగారు. అంత కష్టపడ్డారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది అని హైపర్ ఆది అభినందించారు. ప్రస్తుతం తనకి వస్తున్న అవకాశాలతో హ్యాపీగా ఉన్నానని హైపర్ ఆది పేర్కొన్నారు. 

click me!

Recommended Stories