``చిన్నారి పెళ్లి కూతురు` సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు. అప్పటికి పెళ్లంటే ఎంటే, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పుడు "వధువు" వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇబ్బంది లేదు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు. ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్ పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు నుంచి "వధువు" దాకా ఎన్నో సందర్భాల్లో నా ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగింది. నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్ కు టైమ్ కోల్పోయినా.. నటిగా ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నా, ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా. `వధువు`లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లీ సీన్ చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లి కూతురు అయ్యా అనిపించింది` అని చెప్పింది.