ప్రభాస్ తొలిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో 'ఆదిపురుష్' పై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. భారీగా విఎఫెక్స్ వర్క్ ఉండడంతో దీనికోసం దర్శకుడు ఏకంగా 6 నెలల సమయం కేటాయించారు. ప్రస్తుతం సిజి, విఎఫెక్స్ వర్క్ వేగంగా జరుగుతున్నాయి.