`వార్ 2` సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం టైటిల్ కూడా బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ ల మాటే లేదు. ఈ క్రమంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజు డైరెక్ట్ గా టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. టైటిల్, ఫస్ట్ లుక్‌తోపాటు ఎన్టీఆర్‌పై టీజర్ ని కట్ చేసినట్టు తెలుస్తుంది.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో తాజాగా హృతిక్ పెట్టిన పోస్ట్ కూడా దానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్ కిది పెద్ద పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.