గర్ల్ ఫ్రెండ్ సబా కోసం అపార్ట్ మెంట్ కొన్న హృతిక్ రోషన్.. ఖరీద్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Published : Nov 19, 2022, 12:42 PM ISTUpdated : Nov 19, 2022, 12:43 PM IST

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఖరీదైన ఇల్లును కొన్నట్టు తెలుస్తోంది. లివింగ్ టుగెదర్ కోసమే కొత్తింటిని కొనుగులు చేశారంట. ఇంతకీ ఆ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.  

PREV
16
గర్ల్ ఫ్రెండ్ సబా కోసం అపార్ట్ మెంట్ కొన్న హృతిక్ రోషన్.. ఖరీద్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

యాక్షన్ హీరో, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హృతిక్, అన్ని జానర్లలో సినిమాలు చేస్తూ అభిమానులను ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాప్ హీరోలలో ఒకరిగానూ, అత్యధిక రెమ్యూనరేషన్ ఇండియన్ హీరోగానూ పేరు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. హృతిక్ తన పర్సనల్ లైఫ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 
 

26

ఇంటీరియర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సుస్సానే ఖాన్ ను హృతిక్ రోషన్  2000 సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్నాడు. వీరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 14 ఏండ్లపాటు కలిసి ఉన్న ఈ జంట 2014లోనే చట్టప్రకారం విడిపోయింది. 

36

డివోర్స్ తీసుకున్నాక హృతిక్, సుస్సానే ఖాన్ వేర్వేరుగా ఉంటూ ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు. అనంతరం కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న హృతిక్ రోషన్ గతేడాది నటి, మ్యూజిషియన్ సబా అజాద్ (Saba Azad)తో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

46

హృతిక్ రోషన్, సబా ఆజాద్‌ జంటగా కలిసి అనేక ఈవెంట్‌లకూ హాజరవుతున్నారు. తరచుగా సిటీలో, ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తూ ఉన్నారు. ఏదోరకంగా వీరిద్దరి లవ్ మేటర్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటోంది. తాజాగా వీరిద్దరి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరూ కలిసి జీవించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం హృతిక్ రోషన్ ఏకంగా రూ.100 కోట్ల విలువ చేసే అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 
 

56

హృతిక్ రూ. 97.5 కోట్లతో మూడు అంతస్తుల్లో రెండు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసినట్లు ఓ ఇంగ్లీష్ ఛానెల్ వెల్లడించింది. ఆ సమాచారం మేరకు అన్ని హంగులతో  38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్‌లోని టాప్ 2 ఫ్లోర్‌లను రినోవేట్ చేస్తున్నట్లు స్ట్రాంట్ బజ్ వినిపిస్తోంది. 

66

సబా ఆజాద్ ప్రస్తుతం రాకెట్ బాయ్స్ సీజన్ 2 షూటింగ్ కు సిద్ధం అవుతోంది.  ఇక హృతిక్ చివరిగా ‘విక్రమ్ వేదా’తో అలరించిగా..  ప్రస్తుతం ‘ఫైటర్’(Fighter)లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణె హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories