Lenin Movie: కొడుక్కి ఎట్టకేలకు ఒక్క హిట్టు, ఏడ్చేసిన నాగార్జున.. తండ్రి కాళ్లపై పడి అఖిల్ భావోద్వేగం

Published : Jul 10, 2026, 08:05 PM IST

అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం నేడు శుక్రవారం జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. 

PREV
15
అఖిల్ లెనిన్ మూవీ

అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ కూడా మొదలైంది. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి చిత్తూరు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మ్యాజిక్ చేశారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఈ చిత్రం పాస్ అయిపోతుంది అని క్రిటిక్స్, ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

25
ఎట్టకేలకు అయ్యగారికి హిట్టు

అఖిల్ చాలా కాలంగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. లెనిన్ మూవీతో అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలి అని అక్కినేని అభిమానులు భావించారు. బజ్ కూడా బాగా ఏర్పడింది. అనుకున్నట్లుగానే లెనిన్ చిత్రానికి తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో చిత్ర యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహం ముందు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

35
ఏడ్చేసిన తండ్రీ కొడుకులు

ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నాగార్జున, అఖిల్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అంతే కాదు భావోద్వేగంతో తండ్రీ కొడుకులు ఏడ్చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుక్కి ఎట్టకేలకు దక్కిన విజయం కావడంతో ఎప్పుడూ కూల్ గా ఉండే నాగార్జున సైతం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. సంతోషంలో ఏడ్చేశారు.

45
తండ్రి కాళ్లపై పడ్డ అఖిల్

అఖిల్ అయితే ఏడుస్తూ తండ్రి కాళ్లపై పడి మొక్కారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడుకు ప్రయోజకుడైతే, సక్సెస్ సాధిస్తే తండ్రి సంతోషం ఇలాగే ఉంటుంది అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

55
అఖిల్ నటనకు ప్రశంసలు

ఈ చిత్రంలో దర్శకుడు పెట్టిన ట్విస్ట్ లు, అఖిల్ నటన చాలా బావున్నాయి అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అఖిల్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. నాగార్జున, సితార నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories