హాలీవుడ్ చిత్రాలు భారతీయ ప్రేక్షకులను పలకరించడం కొత్తేమీ కాదు. అయితే, భారతీయ నటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం అరుదు. అవెంజర్స్: ది ఎండ్ గేమ్ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రస్సో బ్రదర్స్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ధనుష్ నటించబోతున్నారని సమాచారం. రస్సో బ్రదర్స్ అనగానే మనకు గుర్తొచ్చే చిత్రాలు అవెంజర్స్ సిరీస్. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, మంత్రముగ్ధులను చేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో చిత్రాలను తెరకెక్కించిన వారు..