Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి జంటగా అవకాశం వస్తే ఏ హీరోయిన్ కాదంటుంది. సూపర్ స్టార్ తో జోడీ కట్టడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎదురు చూస్తుంటారు? అటువంటి అవకాశమే వచ్చింది ఓ నటికి.. విషయం తెలియగానే ఎగిరి గంతేసిందట కూడా. ఎవరా హీరోయిన్?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'భరత్ అనే నేను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు నటన అభిమానులను, ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భరత్ అనే నేను సినిమా ముందు వరకూ వరుసగా ప్లాప్ సినిమాలు చూసిన సూపర్ స్టార్ ఈ మూవీ తరువాత నుంచి వరుసగా హిట్లు కొడుతూనే ఉన్నాడు . భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ అమాయకత్వం, అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో కియారాను తీసుకోడానికి వెనుక ఓ కారణం ఉందన్నారు దర్శకుడు కొరటాల.
24
స్టార్ హీరోయిన్ కాకుండా కొత్త ముఖం ఎందుకు?
ఈ సినిమాకు మహేష్ బాబు జోడీగా కియారా అద్వానీని ఎలా ఎంపిక చేశారనే విషయాలపై దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో హీరో ముఖ్యమంత్రి (సీఎం) హోదాలో ఉంటాడని, అలాంటి శక్తివంతమైన పాత్ర పక్కన ఇప్పటికే గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్‌ను పెడితే ఆ సీన్ అంతగా అతకదని కొరటాల శివ భావించారు. "ఒక ముఖ్యమంత్రి అత్యంత సాధారణమైన, మధ్యతరగతికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రావాలి. దానికి స్టార్‌డమ్ లేని, అంతగా పరిచయం లేని కొత్త ముఖం అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని మేము ముందుగానే నిర్ణయించుకున్నాం" అని కొరటాల అన్నారు.
34
ఎగిరి గంతేసిన హీరోయిన్
మహేష్ బాబు సరసన ఫ్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడికి హిందీ చిత్రం 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' గుర్తొచ్చింది. ఈ సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించిన కియారా అద్వానీ గుర్తుకు రాగానే.. ఆడిషన్స్ కోసం అప్రోచ్ అయ్యారు. కియారా రూపం ఎంతో హోమ్‌లీగా, గ్లామరస్‌గా ఉండటమే కాకుండా ఆమె అద్భుతమైన నటి కూడా కావడంతో వెంటనే సంప్రదించారు.
ఈ సినిమా కథ చెప్పడానికి టీమ్ ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, కేవలం అర్ధగంటలోనే కథ విన్న కియారా అద్వానీ ఎంతో ఉత్సాహపడిపోయారట. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం, అందులోనూ అంతటి బలమైన కథ దక్కడంతో ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశారని కొరటాల శివ తెలిపారు. ఆ వెంటనే ఫోటోషూట్ నిర్వహించగా, మహేష్ పక్కన కియారా అద్వానీ జోడీ పర్ఫెక్ట్‌గా సరిపోయిందని నిర్ణయించుకున్నారు.
భరత్ అనే నేను సినిమాలో హీరో మాట్లాడే ఫోన్ కాల్స్, వారి రిలేషన్‌షిప్ గురించి ప్రెస్ మీట్‌లో మహేష్ బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఐదేళ్లయినా గుర్తుండిపోయేలా ఉంటాయని దర్శకుడు కొరటాల అన్నారు. ఏది ఏమైనా, సరైన పాత్రకు సరైన నటిని ఎంచుకోవడం వల్లే 'భరత్ అనే నేను' సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్‌ను అందించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని కొరటాల అన్నారు.