బాలు మరణానికి అసలు కారణమదే!! ట్రీట్ చేసిన నర్సులు,డాక్టర్లు చెప్పిన ఇంట్రస్టింగ్ విషయాలు

First Published Sep 28, 2020, 11:56 AM IST

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే. బాలు మరణానికి కరోనా కారణం కాదు.. ఆయన కరోనా నుంచి కోలుకున్నా ఇతర కారణాలే బాలు మరణానికి కారణమయ్యాయని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి డాక్టర్,ఎస్బీ బాలుని ట్రీట్ చేసిన లీడ్ దీపక్ సుబ్రమణియన్ సభానాయగం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వాళ్ల హాస్పటిల్ లో ఉన్నప్పుడు ఆయన డాక్టర్స్ తో ,నర్స్ లతో ఎలా ఉన్నారు..ఎలా మొదట్లో తేరుకున్నారు. తర్వాత పరిస్దితి ఎలా విషమించించో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు యధాతథంగా...
 

ఆగస్టు 5 న హాస్పటిల్ కు కరోనాకు సంభందించి మైల్డ్ సింప్టమ్స్ తో వచ్చారు సుబ్రమణ్యం. వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. తాను బాగున్నానని వీడియో మేసేజ్ తో అభిమానులకు తెలియచేసారు. కానీ అవే చివరి మాటలు ప్రపంచానికి అవుతాయని అనుకోలేదు. హాస్పటిల్ కు వచ్చిన నాటి నుంచి చివరి గా పార్దివ దేహం అంబులెన్స్ ఎక్కేదాకా మధ్యలో 51 రోజులు పాటు ఏం జరిగిందో డాక్టర్ వివరించారు.
undefined
మొదట ఆయన చాలా నార్మల్ గా కనిపించారు. కానీ ఆగస్టు 13 వ తేదీ లేట్ నైట్ శ్వాసకోస సమస్య మొదలైంది. దాంతో అందుకు సంభందించి ఓ ఎక్సపర్ట్ మెడికల్ టీమ్ ..ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు వచ్చి లైఫ్ సపోర్ట్ ఇచ్చారు. మొదట వెంటిలేటర్ పెట్టాం..ఆ తర్వా పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడకపోవటంతో ఎక్మో ని ఉపయోగించాం అని సీనియర్ డాక్టర్ చెప్పారు.
undefined
బాలు క్లినికల్ లీడ్ డా.వి సభానాయగం. ఆయన పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగింది. ఆయన మాట్లాడుతూ..బాలుగారి కు ప్లాస్మా థెరపీ ఇచ్చారు. రెమిడ్సివేర్ వంటి రికమెండ్ చేసిన మెడిసన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చాం. బ్లడ్ క్లాట్ కాకుండా మందులు వాడాం.
undefined
ఓ ప్రక్కన ట్రీట్మెంట్ తో పాటు ఫిజయోథెరపీ నిర్వహించాం. ఆయన ఆక్సిజన్ లెవిల్స్ పెరగటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎక్సపర్ట్స్ సలహాలు తీసుకంటూ ఆయనకు వైద్యం చేసాం.
undefined
ఆయన్ను చూసుకోటానికి ఓ నర్సుల టీమ్ ఇరవై నాలుగు గంటలూ ఉండేలా ఏర్పాటు చేసాం. వాళ్లకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్, కేర్ చూసి వాళ్లే ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట్లాడలేకపోయినా కాగితంపై ఆయన మాటలను చిన్న చిన్న గా రాసావారు.
undefined
నర్సింగ్ టీమ్ కు ఆయన “love you all” అనే మెజేస్ రాసి ఇచ్చారు. అదే వాళ్లకు రాసిన ఫస్ట్ నోట్. తర్వాత ఏ అవసరం వచ్చినా కాగితంతోనే సంభాషించేవారు.
undefined
ఇక బాలుగారి కుమారుడు, సింగర్, సిని నిర్మాత అయిన ఎస్ పి బి చరణ్ ...ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇస్తూండేవారు. బాలుగారికి అవన్నీ తెలుసు.
undefined
ఇక ఆయన ఎప్పుడూ తన హాస్పటిల్ రూమ్ లో లలితా సహస్రనామం ప్లే చేయమని అడిగి, వింటూండే వారు. అది ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి.
undefined
ఐపీఎల్ సీజన్ మొదలయ్యాక తన రూమ్ లో టీవి పెట్టమని అడిగారు. కొన్ని సార్లు ఆయన కూర్చుని ఆ గేమ్ ని చూస్తూండేవారు.
undefined
కొన్ని సార్లు ఆయన ప్రెండ్స్ పంపిన వీడియో మెసేజ్ లు , ఇంటర్వూలు ప్లే చేసి చూపిస్తూండేవారు చరణ్. వాటిని ఆయన ఆస్వాదించేవారు.
undefined
అయితే మాస్ట్రో ఇళయరాజా సంగీతానికి సంబందించిన వీడియో ప్లే చేస్తే.. బాగా దగ్గరగా కూర్చోమని కొడుకుని అడిగేవారు. అలాగే ఫోన్ అడిగితీసుకుని, దీన్ని రీ ప్లే చేసి, ముద్దుపెట్టుకున్నారు.అది నా జీవితంలో చూసిన గొప్ప మూవ్ మెంట్స్ లో ఒకటి అన్నారు. డాక్టర్ దీపక్.
undefined
ఆయన అంత తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో ఉన్నా మాకు చాలా సహకరించేవారు. ఆయన పద్దతే అంత. ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనుకునే వారు. ఆయనకు ఏదన్నా సమస్య ఉన్నా చాలా జంటిల్ వ్యవహించేవారు అని అక్కడ సీనియర్ నర్సు చెప్పటం జరిగింది.
undefined
ఆయన నర్సులకు ..తనకు సూప్ తాగాలనిపించినప్పుడు కాని, వెంటిలేటర్ లో ఆక్సిజన్ లెవిల్స్ పెంచమని కానీ తగ్గించమని గానీ అడిగేటప్పుడు కాగితంపై రాసేవారు.
undefined
ఈ నెల మొదట్లో డాక్టర్లు ఆయనకు మెడ వద్ద చిన్న సర్జరీ చేసి హోల్ పెట్టి డైరక్ట్ గా గాలి వచ్చేలా చేసారు. ఇది ఎక్కువకాలం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉండేవాళ్లకు రెగ్యులర్ గా చేసే పని. ఈ ప్రొసీజర్ రొటీన్ అయ్యినా..వాళ్లు కంగారుపడ్డారట.
undefined
కారణం..ఆయన సింగర్. వాయిస్ కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని. వోకల్ కార్డ్ లు ఎక్కడ దెబ్బ తింటాయో అని. ఆ ప్రొసీజర్ అయ్యాక..బాలుని అడిగారట. ఎలా ఉంది అని. ఆయన తన గొంతనుని సరిచేసుకుని నేను బాగున్నాను అన్నారని అక్కడ మరో సీనియర్ డాక్టర్ డా రావు చెప్పారు.
undefined
ఇక మెదడులో రక్తస్రావం శ్వాసకోశ సమస్యలతోనే ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఊబకాయం తగ్గించుకునేందుకు ఏడేళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకోవడం మినహా ఆయనకు మధుమేహం కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆహారపు నియమాలను కూడా చక్కగా పాటించేవారని తెలిపారు.
undefined
అమెరికా ఫ్రాన్స్కు చెందిన వైద్య నిపుణుల సలహాలతో చికిత్స చేశామన్నారు. దీంతో ఆయన స్పృహలోకి వచ్చి అందరినీ గుర్తించగలిగారని సెప్టెంబరు 5న వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారని పేర్కొన్నారు.
undefined
నోటి ద్వారా ఆహారం తీసుకుని కోలుకుంటూ వచ్చారని గత గురువారం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి ఆందోళనకరంగా మారిందన్నారు.
undefined
సీటీస్కాన్ తీసి పరీక్షించినప్పుడు మెదడులో రక్తస్రావం గుర్తించామన్నారు. అదే సమయంలో శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఫలితం లేకపోయిందని.. పరిస్థితి విషమించి మరణించారని వైద్యులు పేర్కొన్నారు.
undefined
click me!