పందెంకోడి పిల్ల ఘాటైన అందాలు... హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్ నుండి ఊహించని యాంగిల్!

First Published | Sep 13, 2023, 5:39 PM IST

హీరోయిన్ మీరా జాస్మిన్ పంథా మార్చింది. అమ్మడు బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. హోమ్లీ బ్యూటీ హాట్ నెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తాజా చోళీ లెహంగాలో ఘాటైన పోజులతో చంపేస్తుంది. 
 

Meera Jasmine

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన విమానం మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసింది. మరిక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 

Meera Jasmine

సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగింది మీరా జాస్మిన్. టాలెంట్ ఉంటే పొట్టి బట్టలు ధరించకుండానే సక్సెస్ కావచ్చని నిరూపించిన హీరోయిన్స్ లో మీరా జాస్మిన్ ఒకరు. సాయి పల్లవి మాదిరి ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేశారు మీరా జాస్మిన్.
 


Meera Jasmine

కెరీర్ నెమ్మదించాక పెళ్లి చేసుకొని మీరా జాస్మిన్ పరిశ్రమకు దూరం అయ్యారు. భర్తతో, కుటుంబ సభ్యులతో ఆమెకు విబేధాలు తెలెత్తాయని సమాచారం. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారట. 

Meera Jasmine

మీరా జాస్మిన్ అంటే  రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై నిండైన బట్టల్లో సాంప్రదాయంగా కనిపించారు. 

Meera Jasmine

ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణతో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ మూవీ చేశారు. ఇటీవల గుడుంబా శంకర్ రీ రిలీజ్ కాగా మీరా ఆనందం వ్యక్తం చేసింది. 

Meera Jasmine

2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు. 2018లో ఓ మలయాళ చిత్రం చేశారు. మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. 
 

Meera Jasmine

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్. గతంలో వెండితెరపై ఆమె చేసిన పాత్ర దృష్ట్యా మీరా జాస్మిన్ హాట్ గా కనిపించడం కొత్తగా తోస్తుంది. 
 

Latest Videos

click me!