Mahavatar Cinematic Universe: మహావతార్‌ సినిమాల లిస్ట్ వచ్చింది.. 11ఏళ్లపాటు వేరే లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

Published : Apr 24, 2026, 08:12 PM IST

హోంబలే ఫిల్మ్స్ తమ 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్' నుంచి 'మహావతార్ పరశురామ్' ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేసింది. ఇందులో పరశురాముడి ముఖం చూపించలేదు. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై రాబోయే సినిమాల లిస్ట్ కూడా బయటకు వచ్చింది.  

PREV
15
వచ్చే ఏడాది `మహావతార్‌ పరశురామ్‌`

హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన యానిమేషన్‌ మూవీ `మహావతార్‌ నరసింహ` బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇది రూ.300కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. దీంతో ఈ సినిమాలపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.  ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే తర్వాతి సినిమా 'మహావతార్ పరశురామ్'. ఈ మూవీ ఇంటెన్స్ పోస్టర్‌ను ఆ మధ్య మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 2027లో విడుదల కానుంది. 

25
మహావతార్‌ రఘునందన్

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'మహావతార్ రఘునందన్' సినిమాను కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2029లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

35
మహావతార్‌ ద్వారకాధీశ్‌
ఈ యూనివర్స్‌లో మరో ఆసక్తికరమైన సినిమా 'మహావతార్ ద్వారకాధీశ్'. ఇందులో ద్వారకాధీశుడి కథను వివరంగా చూపించనున్నారు. ఈ సినిమా 2031లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
45
మహావతార్‌ గోకులానంద
'మహావతార్ గోకులానంద' సినిమాతో ఈ యూనివర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇందులో శ్రీకృష్ణుడి లీలలను చూపించబోతున్నారు. ఈ సినిమా 2033లో విడుదల కానుంది.
55
మహావతార్ కల్కి

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'మహావతార్ కల్కి' రెండు భాగాలుగా రానుంది. దీని మొదటి భాగం 2035లో, రెండో భాగం 2037లో విడుదల కానున్నాయి.  ఇలా దాదాపు 11 ఏళ్లపాటు మహావతార్‌ సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడియెన్స్ ని అలరించనున్నాయి. పిల్లల నుంచి పెద్దలకు విజువల్‌ ట్రీట్‌ని ఇవ్వబోతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories