దర్శకధీరుడు రాజమౌళి విజన్ నుంచి పుట్టుకొచ్చిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పిత గాధగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత అంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
26
రాజమౌళి ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది రామ్, భీం మధ్య స్నేహం గురించే. అది చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహం, బ్రోమాన్స్ బాగా పండింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక అద్భుతం అంటూ కొనియాడుతున్నారు.
36
కానీ హాలీవుడ్ అభిమానులు, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి ఓర్వలేకపోతున్నారు. సోషల్ మీడియాలో విషం కక్కడం ప్రారంభించారు. ఇటీవల హాలీవుడ్ కి ధీటుగా ఇండియన్ సినిమాలు సైతం పుంజుకుంటున్నాయి. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అందరిని మెస్మరైజ్ చేసింది.
46
కానీ జాత్యహంకార ధోరణి ఉన్న కొందరు వెస్ట్రన్ నెటిజన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహాన్ని గే రిలేషన్ షిప్ అంటూ అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ వెస్ట్రన్ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ లో మతిపోగోట్టే యాక్షన్ ఉందని చెప్పారు.. నిజమే.. అడ్వెంచర్ మూవీ అన్నారు నిజమే.. రివేంజ్ అన్నారు నిజమే.. కానీ ఈ చిత్రం గే మూవీ అని ఎవరూ చెప్పలేదు ఏంటి ? అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు.
56
ఆర్ఆర్ఆర్ మూవీ కొన్నిచోట్ల గే రొమాన్స్ మూవీ అనిపిస్తోంది అంటూ మరో వెస్ట్రన్ నెటిజన్ కామెంట్స్ చేశాడు. దీనితో వారికి ఇండియన్ సినిమా అభిమానులు గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తున్నారు. ఈ వెస్ట్రన్ వాళ్ళు అసలు మారరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. వెస్ట్రన్ వాళ్లకు స్నేహం, బ్రోమాన్స్ గురించి తెలియదు. అందుకే ఆర్ఆర్ఆర్ మూవీని గే మూవీ అంటున్నారు.
66
ఇద్దరు పురుషుల స్నేహంపై కల్పిత గాధగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై వెస్ట్రన్ ఆడియన్స్ ఓర్వలేకపోతున్నారు. అందుకే గే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది వీళ్ళ మానసిక పరిస్థితికి నిదర్శనం అంటూ తిరిగి కౌంటర్ ఇస్తున్నారు.