హిట్ 3 ఫస్ట్ డే సెన్సేషన్, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాని సినిమా, ఎంత రాబట్టిందంటే?

Published : May 02, 2025, 11:22 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా  శైలేష్ కొలను డైరెక్షన్ లో  తెరకెక్కిన  సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3. భారీ అంచనాల నడుమ మే 1న రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ ను కూడా సాధిస్తోంది.    సెన్సేషనల్ వసూళ్లు  అందుకుంటుంది. మరీ ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 అదరగొడుతుంది.  

PREV
15
హిట్ 3 ఫస్ట్ డే సెన్సేషన్, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాని సినిమా, ఎంత రాబట్టిందంటే?
Nani starrer Hit 3 collection report pre sale

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన సైకో థ్రిల్లర్ మూవీ  హిట్ 3.  నాని నిర్మాతగా వచ్చిన  హిట్ 1, హిట్ 2 సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హిట్ 3 కోసం ఆసారిహీరోగా రంగంలోకి దిగాడు నాని. ఈసినిమాను నిర్మిస్తూ.. నటించాడు.  మే 1న రిలీజ్ అయిన  ఈ సినిమాకు మొదటి రోజు కాస్త మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కొందరు సినిమా అద్భుతంగా ఉందని అంటే.. ఇంకొందరు మాత్రం యావరేజ్ అని అన్నారు. కాని చిన్నగా సినిమా కలెక్షన్స్ పుంజుకుంటున్నాయి. . 

Als Read: నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?

25
Nani starrer Hit 3

నాని హిట్ 3 సినిమా సింగిల్ స్క్రీన్స్ మీద మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. మాస్ ఆడియెన్స్ ఈసినిమా చూసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్  పల్స్‌కు తగ్గట్టుగా హిట్ 3ని డిజైన్ చేశాడు శైలేష్ కొలను.  డైరెక్టర్ స్ట్రాటజీ బాగా పనిచేసినట్టు కనిపిస్తోంది. మాస్ ఏరియా  నుంచి హిట్ 3 సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు పక్కా అంటున్నారు. అంతే కాదు ఓవర్ సిస్ లో కూడా ఈసినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది మూవీ. 
 

35
Hit 3 Teaser:

నాని గత మూవీ దసరాను మించి పోయింది ఈసినిమా. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. కలెక్షన్ల వివరాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు 30 నుంచి 40 కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టి ఉంటుందని అంటున్నారు. ఇక మేకర్లు మాత్రం ఇంత వరకు అధికారికంగా లెక్కల్ని ప్రకటించలేదు.

45
Actor Nanis Hit 3 film poster

అయితే  యూఎస్ మార్కెట్ లో అప్పుడే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్ లో చేరిపోవడం విశేషం. కేవలం ఇది డే 1 జరిగిపోయింది. 1 మిలియన్ 1 లక్ష డాలర్లు మార్క్ ని ఈ చిత్రం ఇపుడు సొంతం చేసుకుంది. ఇలా మొత్తానికి హిట్ 3 మేనియా యూఎస్ మార్కెట్ లో బీబత్సం చేసేస్తోంది. ఈ వీకెండ్ కి ఈజీగా 2 మిలియన్ మార్క్ ని ఈ సినిమా దాటేస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

55
Two young Heros in Nani HIT 3 in telugu

సినిమా కలెక్షన్ల చూసి నాని టీమ్ మురిసిపోతున్నారు. నేచురల్ స్టార్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో ఇటు స్టార్ డమ్ లో ఒక మెట్టు ఎక్కడంతె పాటు.. నిర్మాతగా లాభాలు కూడా జేబులో వేసుకున్నాడు నాని. అంతే కాదు ఈ సినిమా దెబ్బకు నాని టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చినట్టే అంటున్నారు. మరి నాని భారీ బడ్జెట్ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో  చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories