సంధ్య థియేటర్‌ ఘటన: హైకోర్టులో ‘పుష్ప 2’నిర్మాతలకు భారీ ఊరట

First Published | Jan 2, 2025, 12:14 PM IST

పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. నిర్మాతల పాత్ర సినిమా నిర్మాణానికే పరిమితమని, థియేటర్ ఘటనకు సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది వాదించారు.

అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప–2 సినిమా బెనిఫిట్‌ షో  సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విషయమై కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసులో మైత్రి మూవీస్‌ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

కాకపోతే  దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే వారిని అరెస్ట్‌ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టి.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.  
 
తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్‌ పేరుతో సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను నిర్మించాం. అలాగే ‘పుష్ప 2’తో సహా 30 ఇతర సినిమాలను పంపిణీ చేశాం. 

సంధ్య థియేటర్‌ వద్ద డిసెంబర్‌ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా ఊపిరాడక తన భార్య, కుమారుడు కుప్పకూలారని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భాస్కర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహిళ మృతిచెందగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్‌ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మాపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలి’అని రవిశంకర్, నవీన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

 ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల పాత్ర సినిమా నిర్మాణానికి మాత్రమే పరిమితమని వారి తరఫు న్యాయ వాది వాదించారు. ఒక్కసారి బయ్యర్లకు విక్రయించిన తర్వాత వారి పాత్ర ఏమీ ఉండదని చెప్పారు. ఎటువంటి సంబంధంలేని నిర్మాతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడం సరికాదని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  

Latest Videos

click me!