ఇక ఎన్టీఆర్ బాలయ్యతో నటించిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్ తో ఈ బ్యూటీ నాన్నకు ప్రేమతో సినిమాలో నటించి మెప్పించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వగా.. బాలయ్యబాబుతో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బాలయ్యతో ఓ గెస్ట్ పాత్రలో ఓ పాటలో కనిపించింది.
ఎన్టీఆర్ బయెపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్, ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించి మెప్పించారు. ఇలా బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి సినిమాల్లో ఈ బాబాయ్ అబ్బాయితో ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేశారు.