Published : Sep 02, 2022, 05:24 PM ISTUpdated : Sep 02, 2022, 05:32 PM IST
సెంటిమెంట్స్ చూడడానికి సిల్లీగా ఉంటాయి కానీ.. ప్రతిసారి జరుగుతుంటే నమ్మాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే ఆ హీరోయిన్ సంగతి అంతే. ఈ సెంటిమెంట్ పలువురు హీరోయిన్స్ విషయంలో నిజమైంది.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ సుప్రియ నుండి దేవయాని, రేణు దేశాయ్, మీరా జాస్మిన్, అమీషా పటేల్, నికీషా పటేల్ ఇలా ఎందరో ఈ సెంటిమెంట్ కి బలయ్యారు. పవన్ కి జంటగా నటించాక పరిశ్రమ నుండి కనుమరుగైన హీరోయిన్స్ ఎవరో చూద్దాం...
27
Pawan Kalyan Heroines
అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ పవన్ డెబ్యూ మూవీ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి'లో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఆమె కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా గూఢచారి లాంటి చిత్రాలు చేశారు. పవన్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.
37
Pawan Kalyan Heroines
తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పవన్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగ్యానీ పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు.
47
Pawan Kalyan Heroines
ఇక బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాండ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. రేణు ఆయన్నే పెళ్లి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టగా, అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్. కాగా గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరీర్ కూడా గాల్లో కలిసిపోయింది.
57
Pawan Kalyan Heroines
బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్యగోచరం. పవన్ బంగారం ప్లాప్ కావడంతో పాటు మీరా కెరీర్ కి చరమ గీతం పాడింది. ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కళ్ళముందే కనుమరుగై పోయింది. బాలీవుడ్ అంటూ ముంబై పోయి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయ్యింది.
67
Pawan Kalyan Heroines
పవన్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. పవన్ తో ఛాన్స్ కొట్టేశానని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆపై నికీషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది. పంజా సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్, అంజలి లావణ్య ఎటెళ్ళారో దేవుడికే తెలియాలి.
77
Anu Immanuel
అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించి పరిశ్రమ నుండి వెళ్లిపోయారు.