న్యూ యార్క్ వీధుల్లో చెన్నై చిన్నది, వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న త్రిష, వైరల్ పిక్స్..

Published : Oct 01, 2023, 07:32 AM IST

వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది చెన్నై చిన్నది త్రిష. తనకు ఎంతో ఇష్టమైన అమెరికా.. అందులోను ఇంకా ఇష్టమైన న్యయార్క్ నగరంలో సందడి చేస్తోంది బ్యూటీ.   

PREV
16
న్యూ యార్క్ వీధుల్లో చెన్నై చిన్నది, వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న త్రిష, వైరల్ పిక్స్..

త్రిషకు తన బర్త్  సిటీ అయిన చెన్నై అంటే చాలా ఇష్టం. ఇక చెన్నై తరువాత ఆమె ఎంతో ఇష్టపడే నగరం న్యూయార్క్. అందుకే టైమ్ దొరికినప్పుడల్లా న్యూయార్క్ వెళ్ళి.. అక్కడ తన టైమ్ ను  స్పెండ్ చేస్తుంటుంది.  అక్కడి అందాలు ఆస్వాదిస్తుంటుంది. 
 

26

తాజాగా న్యూయార్క్ నగరంలో హడావిడి చేసింది బ్యూటీ. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ.. న్యూయర్క్ లో మాత్రం సామాన్య టూరిస్ట్ లా .. వీధుల్లో తిరుగుతూ.. కాఫీ షాపుల్లో సందడి చేస్తూ కనిపించింది.  ఆ వెకేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

36

ఇక ప్రస్తుతం హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది త్రిష. నాలుగు పదుల వయస్సు వస్తున్నా.. ఏమాత్రం వన్నె తగ్గకుండా మెరిసిపోతోంది. ఈ ఏజ్ లో మళ్లీ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది విజయ్ లాంటి స్టార్ హీరో కాంబినేషన్ లో త్రిష సినిమా చేస్తోంది. 
 

46

అటు అజిత్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చి.. భారీ పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ తో త్రిషకు మరోసారి లైఫ్ వచ్చింది. ఈసినియాల ఐశ్వర్యరాయ్ లాంటి బ్యూటీ ఉన్నా కూడా.. త్రిష అందమే అక్కడ హైలెట్ గా నిలిచింది. ఆమె నటనకు కూడా మార్కులు గట్టిగా పడ్డాయి. 
 

56

ఈసినిమా తరువాత త్రిషకు వరుసగా ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. అందులోను ఈ ఏజ్ లో ఏ విమెన్ సెంట్రిక్ మూవీస్ వస్తాయో అనుకుంటే.. ఏకంగా హీరోయిన్ గా.. అది కూడా తాను మంచి వయస్సులో ఉన్నప్పుపుడునటించి హీరోల సరసన రావడంతో.. త్రిష డిమాండ్ భారీగా పెరిగింది. మరి ముందు ముందు ఇంకాఅవకాశాలు సాధిస్తుందేమో చూడాలి. 
 

66
Actress Trisha

ఇక ఈమధ్య ఆమె ఓ మలయాళ దర్శకుడిని పెళ్లాడబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఈ విషయంలో చాలా కూల్ గా స్పందించి కౌంటర్ ఇచ్చింది త్రిష.  ఈ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నవారి వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలుసు.. మీ ఆటలు సాగవన్నట్టు ట్వీట్ చేసింది బ్యూటీ. తన పెళ్ళి వార్తలకు చెక్ పెట్టేసింది. 

click me!

Recommended Stories