ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన స్కంద చిత్రం ఇటీవల విడుదలై మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. రామ్ కెరీర్ లోనే ఈ చిత్రానికి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. రామ్ కి జోడిగా ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ నటించారు. బోయపాటి ఈ చిత్రంలో రామ్ ని నెవర్ బిఫోర్ మాస్ అవతారంలో ప్రెజెంట్ చేశారు.