బోల్డ్ లుక్ షేర్ చేసిన స్టార్ కిడ్ శివాత్మిక... అద్దం ముందు అడ్డంగా ఏంటంటూ అక్క శివాని కామెంట్!

Published : Jul 24, 2023, 12:35 PM IST

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ లుక్ షేర్ చేశారు. మిర్రర్ సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. శివాత్మిక లుక్ వైరల్ కాగా అక్క శివాని క్రేజీ కామెంట్ చేసింది.   

PREV
16
బోల్డ్ లుక్ షేర్ చేసిన స్టార్ కిడ్ శివాత్మిక... అద్దం ముందు అడ్డంగా ఏంటంటూ అక్క శివాని కామెంట్!
Shivathmika Rajashekar

హీరోయిన్ శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తాజాగా మిర్రర్ సెల్ఫీ దిగారు. సదరు సెల్ఫీలో శివాత్మిక లుక్ బోల్డ్ గా ఉంది. శివాత్మిక పోస్ట్ పై శివాని స్పందించింది. 'అద్దం ముందు అడ్డంగా, కానీ అందంగా కుర్చున్నావ్ కదరా' అని కామెంట్ పెట్టింది. 

 

26

ఇక శివాత్మిక కెరీర్ పరిశీలిస్తే... ఆమె కీలక రోల్ చేసిన రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు. 
 

36
Shivathmika Rajashekar


రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో అనసూయ సైతం కీలక రోల్ చేశారు. 

46
Shivathmika Rajashekar

గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 

 

56

చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు.  హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయితే శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. 

66
Shivathmika Rajashekar


ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. శివాత్మిక అక్క శివాని సైతం హీరోయిన్ అయ్యారు. ఆమె కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కతో పోల్చితే చెల్లి కొంచెం బెటర్. గుర్తింపు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories