గత మూడు నెలలుగా సమంత యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తిరిగి షూటింగ్స్ స్టార్ట్ చేశారు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నట్లు మాట్లాడారు. అలసట, నీరసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని అందుకే గ్లాసెస్ పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు.