చావు నుండి ఏదీ కాపాడలేనప్పుడు... ఆసక్తి రేపుతున్న సమంత పోస్ట్ 

Published : Jul 03, 2023, 07:46 PM IST

సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి  కలిగిస్తుంది. ఆమె ఓ ఎమోషనల్ కొటేషన్ షేర్ చేశారు. సమంత ఏ మూడ్ లో ఇలాంటి కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.   

PREV
16
చావు నుండి ఏదీ కాపాడలేనప్పుడు... ఆసక్తి రేపుతున్న సమంత పోస్ట్ 
Samantha

సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. దశాబ్దానికి పైగా ఆమె టాప్ హీరోయిన్ గా ఉన్నారు. స్టార్స్ తో జతకడుతూ స్టార్డం ఏమిటో నిరూపిస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితం ఆశాజనకంగా లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య దూరమయ్యాడు. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు.

26


ఈ పరిణామం సమంతను మానసిక వేదనకు గురి చేసింది. భర్త దూరమైన బాధకు తోడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంతను పలు విషయాల్లో తప్పుబడుతూ కథనాలు వెలువడ్డాయి. విడాకులకు సమంతనే కారణంటూ సోషల్ మీడియా ఆమెను టార్గెట్ చేసింది. ఒక దశ వరకు భరించిన సమంత న్యాయపోరాటం చేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై కేసులు పెట్టారు. 
 

36


అయినా ఆమె మీద దాడి తగ్గలేదు. మిత్రులు, సన్నిహితులు కఠిన సమయంలో ఆమెకు అండగా నిలిచారు. వివిధ ప్రదేశాలను సందర్శించిన సమంత డిప్రెషన్ నుండి కోలుకున్నారు. ఆ వెంటనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. దాదాపు నాలుగు నెలలు సమంత ఇంటికే పరిమితమైంది. ఈ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేసింది. 
 

46
Samantha

మూడు నాలుగు నెలలుగా సమంత యాక్టీవ్ గా ఉంటున్నారు. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య సమంత ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అతడు ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేదు. కానీ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 
 

56
Samantha

ఈ క్రమంలో సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి కలిగిస్తుంది. 'చావు నుండి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవడమే' అని కోట్ షేర్ చేశారు. ఇది చిలీ దేశానికి ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పారు. ఆయన కోట్ ని సమంత షేర్ చేశారు. ఈ కోట్ ఆమె షేర్ చేయడం వెనుక ఆంతర్యం తెలియాల్సి ఉంది. ఒక ప్రక్క సమంత ప్రేమలో పడ్డారని వార్తలు వస్తుండగా ఈ కామెంట్ మరింత చర్చకు దారి తీసింది. 
 

66

మరోవైపు సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకుడిగా ఉన్నారు. ఇక యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. 
 

click me!

Recommended Stories