అయినా ఆమె మీద దాడి తగ్గలేదు. మిత్రులు, సన్నిహితులు కఠిన సమయంలో ఆమెకు అండగా నిలిచారు. వివిధ ప్రదేశాలను సందర్శించిన సమంత డిప్రెషన్ నుండి కోలుకున్నారు. ఆ వెంటనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. దాదాపు నాలుగు నెలలు సమంత ఇంటికే పరిమితమైంది. ఈ వ్యాధి ఆమెను మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురి చేసింది.