యశోద హిట్ కొట్టింది. అదే సింపతీ ప్లాన్ శాకుంతలం మూవీకి కూడా వాడే ప్రయత్నం చేసింది. యశోద విడుదల తర్వాత సైలెంట్ గా ఉన్న సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో కొత్త అవతారం ఎత్తింది. తెల్ల బట్టలు, జపమాలతో కనిపించింది. ఇక ప్రమోషనల్ ఈవెంట్స్ లో కన్నీరు పెట్టుకుంది. దగ్గుతూ కనీస ఓపిక లేదని మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితి బయటపెట్టింది. హెల్త్ సెట్ కాలేదు, అయినా శాకుంతలం మూవీ మీదున్న ఇష్టంతో ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నానని ఆమె చెప్పారు.