సమంత మయోసైటిస్ బారినపడటం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. చిరంజీవి, ఎన్టీఆర్, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, కియారా అద్వానీ ఇలా పలువురు సమంత ఆరోగ్యంపై స్పందించారు. ఆమెకు దైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. చివరకు అఖిల్ అక్కినేని సైతం కామెంట్ చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన ప్రేమా, ధైర్యం నీకు కలగాలని కోరుకున్నాడు.