నేను మోసం చేసింది వాళ్లను మాత్రమే.. ఇంకో సినిమా తీస్తా.. పూరీ జగన్నాథ్ ఎమోషనల్ లెటర్!

Published : Oct 30, 2022, 04:18 PM ISTUpdated : Oct 30, 2022, 04:19 PM IST

‘లైగర్’తో పూరీ జగన్నాథ్ కు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యతో సతమతం అవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరీ తాజాగా ఓ ఎమోషనల్ లెటర్ ను విడుదల చేశారు. తన నెక్ట్స్ మూవ్ పై క్లారిటీ ఇస్తూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.   

PREV
16
నేను మోసం చేసింది వాళ్లను మాత్రమే.. ఇంకో సినిమా తీస్తా.. పూరీ జగన్నాథ్ ఎమోషనల్ లెటర్!

సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda),  స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ‘లైగర్’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని చవిచూసింది. బాలీవుడ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా భారీ బడ్జెట్ తోనిర్మించారు. కానీ సినిమా పోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. వారి నష్టాల్లో కొంత తిరిగిస్తానని పూరీ కూడా హామీనిచ్చారు. 
 

26

దీంతో సమస్య సద్దుమణిగినట్టే అయ్యి మళ్లీ ముదిరింది. ఇస్తానన్న డబ్బు చెల్లించడంలో పూరీ జగన్నాథ్ కాస్తా ఆలస్యం చేయడంతో ఎగ్జిబిటర్లు పూరీకి బెదిరింపులతో పాటు, ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే పూరీ జగన్నాథ్ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు  జూబ్లీహిల్స్ లోనూ బాధిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. అయినా.. ఎగ్జిబిటర్ల గోల పెరిగిపోతుండటంతో పూరీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో  ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలు కూడా పూరీకి మద్దతుగా నిలిచారు. ఇప్పటికే తమ్మారెడ్డి భరద్వాజ్, చిట్టిబాబు కూడా ఎగ్జిబిటర్లు బెదిరించడం, తిరిగి డబ్బులు ఇవ్వాలనడం సరికాదని తమ అభిమానులను వ్యక్తం చేస్తున్నారు. 

36

ఇదిలా ఉంటే.. తాజాగా పూరీ జగన్నాథ్ స్ట్రాంగ్ ఎమోషనల్ నోట్ ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పూరీ భావోద్వేగ వ్యాఖ్యలు చేయడంతో పాటు తన నెక్ట్స్ మూవ్ పై క్లారిటీ ఇచ్చారు. ‘సక్సెస్, ఫెయిల్యూర్ వేర్వురు కాదు. రెండూ ఫ్లో లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. అందుకే జీవితంలో పడతాం, లేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. 

46

లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక అనుభవంలా చూడాలి తప్ప, ఫెయిల్యూర్,  సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వద్దుకు చేరా, ఇంట్లో తిట్టారు. ఊరే వేలేసింది. ఉరేసుకోవాలనిపించింది, ఎవరో కాపాడాడు. వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు. ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీనే. అందుకే టైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్స్ అయితేనే డబ్బులొస్తాయి.

56

ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ FAILURE గా చూడొద్దు. చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు మాయమైపోతారు. మంచిదే కదా? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి అది రిస్క్ అవ్వారి. లైఫ్ లో రిస్క్ చేయకపోతే అది లైఫ్ కాదు, ఏ రిస్క్ చేయకపోవడమే ఇంకా రిస్క్. లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాటో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. అందుకే మనం హీరో లా బతకాలి. అంటే నిజాయితీగా ఉండాలి. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. 

66

నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియెన్స్ ని తప్ప ఇంకెవ్వరిని నేను మోసం చెయ్యలేదు. వాస్తావానికి నేను నా ఆడియెన్స్ తో నిజాయితిగా ఉన్నాను. ఏదేమైనా మళ్లీ  ఇంకో సినిమా తీస్తా. ఆడియెన్స్ ను తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తా. డబ్బు విషయానికొస్తే చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లినోడు లేదు. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా’ అంటూ తన మార్క్ లో లెటర్ రాశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లెటర్ తో ‘లైగర్’ తెచ్చిపెట్టిన సమస్యల నుంచి పూరీ బయటకి వస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే  నెక్ట్స్ సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories