భర్తతో కలిసి క్యూట్ గా ఫోజులిచ్చిన ప్రణీతా.. చీరకట్టులో మెరిసిపోతున్న బుట్టబొమ్మ

First Published | Jul 22, 2023, 2:39 PM IST

కన్నడ ముద్దుగుమ్మ ప్రణీతా సుభాష్ తొలిసారిగా తన భర్తతో కలిసి ఓ టెంపుల్ ను సందర్శించింది. బ్యూటీఫుల్ శారీలో వెలిగిపోతున్న ఈ బ్యూటీ తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

పెళ్లై, ఓ కొడుకు పుట్టినా చెక్కుచెదరని అందంతో ప్రణీతా సుభాష్ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ వస్తోంది.  కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ లో మైమరిపిస్తోంది. 
 

ప్రణీతా మొదటి లాక్ డౌన్ లోనే పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహమాడింది. రీసెంట్ గానే భర్త 34వ బర్త్ డేను కూడా ప్రణీతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇక తాజాగా భర్తతో కలిసి ఓ టెంపుల్ ను సందర్శించినిట్టు తెలుస్తోంది. 
 


ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. నిండుగా ఉన్న బ్యూటీఫుల్ శారీలో ప్రణీతా మరింత అందాన్ని సొంతం చేసుకుంది. కొలను వద్ద క్యూట్ గా  ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది. బ్యూటీఫుల్ స్మైల్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. 

అయితే తన భర్తతో కలిసి బయటికి వెళ్లిన ఫొటోలను ప్రణీతా ఎక్కువగా ఎప్పుడూ పంచుకోలేదు. ఇక తాజాగా మాత్రం బర్తతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఫ్యాన్స్ పిక్స్ ను లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. ప్రణీతా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.  ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. మునుపటి కంటే ఇప్పుడు జోరుగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చే పనిలో ఉంది. మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. Dileep 148 వర్క్ టైటిల్ తో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక తెలుగులో చివరిగా ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రంలో నటించింది. నెక్ట్స్ ఏ సినిమాతో అలరిస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!