పెళ్లితో స్వేచ్ఛ కోల్పోతాం, అందుకే చేసుకోలేదు... హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్ 

Published : Jul 13, 2023, 11:27 AM IST

నాలుగు పదుల వయసుకు దగ్గరైన సదా పెళ్లిపై భిన్నమైన అభిప్రాయం వెల్లడించారు. పరోక్షంగా తనకు ఆసక్తి లేదని చెప్పేశారు. సదా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
15
పెళ్లితో స్వేచ్ఛ కోల్పోతాం, అందుకే చేసుకోలేదు... హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్ 
Sadaa

హీరోయిన్ సదా ప్రస్తుత వయసు 39 ఏళ్ళు. పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. దీంతో పెళ్లిపై ప్రశ్నలు ఎక్కువయ్యాయి. సదా ఎక్కడకు వెళ్లినా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక సదా ఇబ్బంది పడుతుంది. తాజాగా మనసులో మాట బయటపెట్టింది. తనకు ఆసక్తి లేదని చెప్పి షాక్ ఇచ్చింది. 

 

25
Sadaa

పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ కోల్పోతాము. చేసుకున్న వాడు అర్థం చేసుకునేవాడు కావచ్చు కాకపోవచ్చు. నాకు వైల్డ్ లైఫ్ అంటే ఇష్టం. జంతువులను ప్రేమిస్తాను. పెళ్ళైతే నా అభిరుచులు కొనసాగించలేకపోవచ్చు. అయినా ఈ రోజుల్లో పెళ్లిళ్లు నిలబడటం లేదు. చాలా మంది విడిపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకునే ఆలోచన  లేదని అన్నారు. 

35

సదా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కాగా, విరామం దొరికితే అరణ్యాలకు చెక్కేస్తారు. ఇక శోభన, నగ్మా, టబు వంటి హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. ఈ లిస్ట్ లో సదా చేరనుంది. ప్రస్తుతం సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బుల్లితెర రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బీబీ జోడి, నీతోనే డాన్స్ షోలకు సదా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 


 

45
Sadaa

అలాగే చాలా గ్యాప్ తర్వాత అహింస మూవీలో కీలక రోల్ చేసింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన అహింస చిత్రంతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. అహింస నిరాశపరిచింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సదాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

55
Sadaa

2002లో సదా జయం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జయం బ్లాక్ బస్టర్ కావడంతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దశాబ్దం పాటు సదా సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా కెరీర్ గ్రాఫ్ త్వరగా పడిపోయింది. 2018 తర్వాత ఆమెకు పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. 
 

click me!

Recommended Stories