Sadaa: చేయాల్సిందంతా చేసి తర్వాత చెల్లి అన్నాడు... హీరో విక్రమ్ చేసిన ఆ పని బయటపెట్టిన సదా!

Published : Aug 01, 2022, 11:00 AM IST

స్టార్ హీరో విక్రమ్ ని ఉద్దేశిస్తూ హీరోయిన్ సదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో రొమాన్స్ చేసిన విక్రమ్ తర్వాత చెల్లి అనే వాడంటూ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
16
Sadaa:  చేయాల్సిందంతా చేసి తర్వాత చెల్లి అన్నాడు... హీరో విక్రమ్ చేసిన ఆ పని బయటపెట్టిన సదా!
Sadaa


హీరోయిన్ సదా(Sadaa) కెరీర్ లో అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది, కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అపరిచితుడు మూవీలో విక్రమ్ నటన అద్భుతమని చెప్పాలి. ఆయన కమల్ హాసన్ లాంటి గొప్ప నటులను గుర్తు చేశారు. 

26
Sadaa


ఈ మూవీలో విక్రమ్(Vikram) కి జంటగా సదా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు సదా గుర్తు చేసుకున్నారు. విక్రమ్ తో నా పెయిర్ బాగుంది. మా మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరిందని సెట్స్ లో అందరూ చెప్పుకునేవారు. అయితే హీరో విక్రమ్ మాత్రం నన్ను సిస్టర్ అని పిలిచేవాడు. 

36

anniyan

కథలో భాగంగా మేమిద్దరం కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చింది. డైరెక్టర్ శంకర్ షాట్ రెడీ అనగానే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేవాళ్ళం. డైరెక్టర్ కట్ చెప్పాక విక్రమ్ నన్ను చెల్లి అంటూ పిలిచేవారు. ఇది చూసి సెట్స్ లో ఉన్న సిబ్బంది, నేను నవ్వుకునేవాళ్ళం.

46
Sadaa

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినంత సేపు నటించిన విక్రమ్ తర్వాత చెల్లి అనడం వింతగా ఉండేది. ఆయన చెల్లి అని పిలవడంతో నేను కూడా అన్నయ్య అనడం స్టార్ట్ చేశాను. ఈ విషయమై డైరెక్టర్ శంకర్ సీరియస్ అయ్యాడు. ప్రేక్షకులు హీరో హీరోయిన్ అంటే లవర్స్ భావనలో చూస్తారు. మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటారని బయటికి తెలిస్తే... మొత్తం నాశనం అవుతుంది. రేపు తెరపై మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేరని శంకర్ అన్నారట.

56
Sadaa

ఏది ఏమైనా సిల్వర్ స్క్రీన్ పై విక్రమ్, సదా జంట సూపర్ సక్సెస్. ప్రేక్షకులు ఈ జంటకు ఫుల్ మార్క్స్ వేశారు. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అపరిచితుడు తర్వాత సదాకు ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలెక్షన్స్ తడబడ్డ సదా చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారు.

66

డెబ్యూ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన సదా ఆ జోరు కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అక్క, వదిన పాత్రలకు సై అంటున్నారు. సీనియర్ హీరోల పక్కన వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సదా కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

click me!

Recommended Stories