రక్షిత్ శెట్టి లేటెస్ట్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తన లవ్ బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యాడు.
16
Rashmika Mandanna
చార్లీ 777 మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రక్షిత్ శెట్టి. వరుసగా రక్షిత్ శెట్టి తన సినిమాలు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. సప్త సాగరాలు దాటి మూవీ ఇటీవల విడుదలైంది. సప్త సాగరాలు దాటి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రియురాలి కోరిక తీర్చాలని డబ్బు కోసం తనపై నేరం మోపుకొని జైలుకు వెళ్లిన ప్రియుడి కథే సప్త సాగరాలు దాటి.
26
ఈ చిత్రానికి సీక్వెల్ ఉంది. సప్త సాగరాలు దాటి సైడ్ బి నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రక్షిత్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన లవర్ ఎఫైర్స్ గురించి ఆయన ఓపెన్ అయ్యారు. రష్మిక మందాన కంటే ముందు ఈయన మరో అమ్మాయిని ప్రేమించాడట. అప్పుడు స్నేహితుడు మోసం చేశాడట.
36
Rakshit Shetty and Rashmika Mandanna
రక్షిత్ శెట్టి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి తన ప్రేమ తెలియజేయాలని లవ్ లెటర్స్ రాసేవాడట. ఆ లెటర్స్ ఆ అమ్మాయికి ఇవ్వమని క్లోజ్ ఫ్రెండ్ కి ఇచ్చేవాడట. రెండేళ్లు గడుస్తున్నా ఆ అమ్మాయి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదట.
మేటర్ ఏంటని ఆరా తీస్తే తాను రాసిన ఆ లెటర్స్ లో ఒక్కటి కూడా తన ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఇవ్వలేదట. కట్ చేస్తే తన ఫ్రెండ్, ఆ అమ్మాయి ఇప్పుడు భార్య భర్తలు అట. అలా ఇష్టపడిన అమ్మాయి విషయంలో మిత్రుడు చీట్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక కిరిక్ పార్టీ మూవీలో తనతో జతకట్టిన రష్మిక మందానను రక్షిత్ శెట్టి ప్రేమించాడు.
56
రక్షిత్ శెట్టి-రష్మికల ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా రష్మిక మందాన మనసు మారింది. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. ఈ క్రమంలో రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ రష్మిక మీద ఫైర్ అయ్యారు. తనను ట్రోల్ చేయకండని రక్షిత్ శెట్టి స్వయంగా ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశాడు.
66
sapta sagaradaache ello
రెండుసార్లు ప్రేమలో విఫలమైన రక్షిత్ శెట్టికి లవ్ ఎఫైర్స్ కలిసి రావడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక సప్త సాగరాలు దాటి మూవీ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. హేమంత్ ఎం రావ్ దర్శకుడు. రక్షిత్ శెట్టి నిర్మాత కూడాను.