అందానికి అమ్మ చెప్పిన చిట్కా... రష్మిక మందాన బ్యూటీ సీక్రెట్ ఇదే!

Published : Jun 26, 2023, 02:16 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందాన తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. తన మేని ఛాయకు అమ్మ చెప్పిన ఓ చిట్కా అద్భుతంగా పని చేస్తుందని వెల్లడించారు.

PREV
17
అందానికి అమ్మ చెప్పిన చిట్కా... రష్మిక మందాన బ్యూటీ సీక్రెట్ ఇదే!

హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. ఫిట్ అండ్ స్లిమ్ బాడీతో పాటు మెరిసే చర్మం, పట్టులాంటి జుట్టు అవసరం. స్టార్ లేడీ రష్మిక మందాన కట్టిపడేసే అందం కలిగి ఉన్నారు. తన సౌందర్య రహస్యం ఆమె బయటపెట్టారు. 

27

అందం కోసం పెద్దగా హైరానా పడిపోవాల్సిన అవసరం లేదంటున్న రష్మిక అమ్మ చెప్పిన ఓ చిట్కా ఫాలో అయితే చాలు అంటుంది. గోరు వెచ్చని కొబ్బరి నూనెతో ముఖం, జుట్టు మర్దనా చేసుకుంటే అద్భుతమైన మాయిశ్చరైజర్ వలె పని చేస్తుందట. అందుకే ఈ మాత్రం ఖాళీ సమయం దొరికినా తాను అదే చేస్తుందట. మరి ఇంకెందుకు ఫ్యాన్స్ ఫాలో అయితే సరి . 

37

ఇక రష్మిక కెరీర్ పరిశీలిస్తే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ కాగా, హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. ఇక విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారసుడు మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఆ చిత్రంలో రష్మిక పాత్ర జస్ట్ సోసో గా ఉంటుంది. వారసుడు చిత్ర కథలో రష్మిక పాత్ర దర్శకుడు పాటలకే పరిమితం చేశాడు.

 

47
Rashmika Mandanna


 రష్మిక రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. 

57


ఇక రష్మిక ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2023 డిసెంబర్ లో విడుదల కానుందని సమాచారం. అలాగే పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందట. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

67
Rashmika Mandanna

బాలీవుడ్ పై కన్నేసిన రష్మిక యానిమల్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసిన సందీప్ రెడ్డి నుండి వస్తున్న యానిమల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 

77
Rashmika Mandanna


కెరీర్ ఇలా ఉండగా రష్మిక తరచుగా వివాదాల్లో ఉంటున్నారు . ఆమెను కన్నడ పరిశ్రమ దూరం పెట్టిందనే వాదన ఉంది. ఒక దశలో బ్యాన్ చేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. అలాగే రష్మిక హీరో విజయ్ దేవరకొండతో ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories