అన్నింటికీ సిద్థపడే వచ్చాను.. ట్రోల్స్ పై స్పందించిన రాశీ ఖన్నా

Published : Feb 26, 2023, 08:13 AM IST

టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో.. ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తోంది హీరోయిన్ రాశీఖన్నా. రీసెంట్ గా డిజిటల్ మీడియాలోకి కూడా ఎంటరయ్యింది. ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పై కూడా స్పందించింది బ్యూటీ.   

PREV
16
అన్నింటికీ సిద్థపడే వచ్చాను.. ట్రోల్స్ పై స్పందించిన రాశీ ఖన్నా
Rashi Khanna

తెలుగులో బాగా  వెనకబడింది  హీరోయిన్ రాశీ ఖన్నా. టాలీవుడ్ లో వర్కౌట్ అవ్వకపోవడంతో..తమిళం వైపు అడుగులు వేసింది. కాని అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. బాలీవుడ్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించకుంటోంది రాశీ ఖన్నా.  బీటౌన్ లో కాస్త అవకాశాలు అందుతున్నాయి బ్యూటీకి  

26

వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న రాశీకి హిందీలో అవకాశాలు అందుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో నాలుగు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి రాశీకి.  ఇక హఇందీలో.. కొత్త పెళ్లికొడుకు సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన యోధ మూవీ చేస్తుంది బ్యూటీ. ఇక ఆమె ఆశలన్నీ.. ఈసినిమాపైనే ఉన్నాయి. ఈ మూవీ హిట్ అయితే.. ఆమెకు బాలీవుడ్ లోస్పేస్ దొరికినట్టే. 
 

36

తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కేసింది బ్యూటీ.. హిందీలో షాహీద్ కపూర్ జంటతా.. ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో ఆర్బీఐ ఆఫీసర్ పాత్రలోనటించి మెప్పించింది. ఈ సిరీస్ లో కాస్త బోల్డ్ సీన్స్ కూడా చేసింది బ్యూటీ. ఈ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమెకు బాలీవుడ్ లో ప్లాస్ అయ్యింది. పలు వెబ్ మూవీస్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. 
 

46

ఇక రీసెంట్ గా తన కెరీర్‌పై  స్పందించింది రాశీ ఖన్నా. నటన అంటే ఇష్టం కాని.. ఫస్ట్ మూవీ మద్రాస్‌ కేఫ్‌ చేస్తున్నప్పుడు మాత్రం తనకు ఏం తెలియదంటూ చెప్పకొచ్చింది. కాని సౌత్ లో వరుస ఆఫర్లు రావడంతోనే.. నటపై దృష్టి పెట్టి.. మెళకువలు నేర్చుకున్నట్టు తెలిపింది. కొత్త విషయాలు నేర్చుకుంటూ నట ప్రయాణం సాగిస్తూ వచ్చా. నేను తెచ్చుకున్న పేరు వెనక ఎంతో శ్రమ ఉంది. 

56

ఇక తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో కూడా స్పందించింది రాశీ ఖన్నా.. కెరీర్ మొదట్లో వరుసగా ప్లాప్ లు చూశాను.. అవి బాగా బాధించాయి.. కాని ఇప్పుడు ఫెయిల్యూర్స్ ను కూడా ఈజీగా తీసుకుంటూ.. జయాపజయాలకు అతీతంగా నిబ్బరంగా ఉండటం అలవాటైపోయింద అంటోంది. 

66

ఇండస్ట్రీలో ఉండాలి అంటే  సక్సెస్‌ అనేది ముఖ్యం. సక్సెస్ లేకుంటే మనిషిలా చూడరు అంటూ .. అసలు విషయం బయట పెట్టింద.ఇక తాను  పబ్లిక్‌ ఫిగర్‌  కాబట్టి.. విమర్షలు తప్పవు.. కాని తానెప్పుడూ.. విమర్శలు, ట్రోలింగ్స్‌ ను లెక్కచేయడను అంటోంది. వాటన్నింటికి  సిద్ధపడే ఉంటాను.. అందుకే వాటిని  పట్టించకోను అంటోంది బ్యూటీ. ఇక రీసెంట్ గా సిద్థార్ధ్, కియారా పెళ్లిలో.. హాట్ హాట్ శారీలో మెరుపులు మెరిపించింది బ్యూటీ. 

click me!

Recommended Stories