స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమె నూతన సంవత్సర వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
కొత్త ఏడాది వస్తుందంటే అందరికీ ప్రత్యేకమే. ఆనందంగా వెల్కమ్ చెప్పాలి అనుకుంటారు. సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెడితే ఏడాది మొత్తం హ్యాపీగా ఉంటుందని భావిస్తారు. కాగా హీరోయిన్ రకుల్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. తన సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
26
Rakul Preeth Singh
రకుల్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక 2023లో రకుల్ వివాహం చేసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. 2021లో రకుల్ తన బర్త్ డే సందర్భంగా తన ప్రియుడ్ని పరిచయం చేశారు.నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు.
36
Rakul Preeth Singh
అప్పటి నుండి రకుల్ ని మీడియా పెళ్లెప్పుడో చెప్పాలని వెంటపడుతుంది. పదే పదే అడుగుతుంటే సహనం కోల్పోయిన రకుల్... ఒకటి రెండు సార్లు ఫైర్ అయ్యారు. కాగా రకుల్ తమ్ముడు 2023లో రకుల్ వివాహం ఉండొచ్చు. పెళ్లి ఆలోచన ఉంది, ఇద్దరూ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉండటం వలన ఆలస్యం అవుతుందని గతంలో చెప్పాడు.
46
Rakul Preeth Singh
కాగా రకుల్ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. రకుల్ ప్రీత్ లేటెస్ట్ మూవీ థాంక్ గాడ్ గత ఏడాది అక్టోబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలు చేసిన థాంక్ గాడ్ చిత్రానికి ఇంద్ర కుమార్ దర్శకుడు. థాంక్ గాడ్ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఫలితం నిరాశపరిచింది.
56
Rakul Preeth Singh
2022లో రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి.
66
Rakul Preeth Singh
మరో రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ఇక రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.