Rakul Preeth Singh: కోటులో సూపర్ హాట్ గా రకుల్... డ్రెస్ ఏదైనా పరువాల ప్రదర్శన కామన్!

Published : Jan 22, 2023, 01:25 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ వరుస ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. స్టార్ లేడీ కార్పొరేట్ లుక్ కేక పుట్టిస్తుంది.   

PREV
17
Rakul Preeth Singh: కోటులో సూపర్ హాట్ గా రకుల్... డ్రెస్ ఏదైనా పరువాల ప్రదర్శన కామన్!
Rakul Preeth Singh


స్టైల్ తో సంబంధం లేకుండా హాట్నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా సూట్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చారు. రకుల్ తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 
 

27
Rakul Preeth Singh

ఇక కొత్త ఏడాది మొదలై నెలరోజులు కాకుండానే మూవీ విడుదల చేసింది రకుల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఛత్రీవాలి జీ5 లో నేరుగా విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. 

37
Rakul Preeth Singh


సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది. 
 

47
Rakul Preeth Singh

కాగా ఈ ఏడాది రకుల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. 2021లో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు రకుల్ ప్రీత్ వెల్లడించారు. ఈ క్రమంలో పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు తరచూ అడుగుతున్నారు. పదే పదే అడుగుతుంటే రకుల్ అసహనానికి గురవుతున్నారు.

57
Rakul Preeth Singh

విశ్వసనీయ సమాచారం ప్రకారం రకుల్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట. రకుల్ తమ్ముడు సైతం 2023లో అక్క పెళ్లి ఉంటుందని గతంలో హింట్ ఇచ్చాడు. నటిగా కూడా ఆమె జోరు తగ్గింది. దీంతో పెళ్ళికి ఇదే రైట్ టైం అని ఆమె భావిస్తున్నారట. 
 

67
Rakul Preeth Singh

2022లో రకుల్ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అయితే ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. వరుసగా ఆమెకు ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ ఆమె చేతిలో ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారు.

77
Rakul Preeth Singh

ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు. 
 

click me!

Recommended Stories