Rakul Preeth Singh: గులాబీ మొగ్గలా ఉండే రకుల్ అగ్గిపుల్లలా అయిపోయిందేంటీ... కారణం అదేనా!

Published : Feb 24, 2023, 01:38 PM IST

హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. దాని కోసం చాలా త్యాగాలు చేస్తారు. ఇష్టమైన ఫుడ్ మానేసి కడుపు మాడ్చుకుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఒక్కసారి షేప్ అవుట్ అయితే మేకర్స్ పక్కన పెట్టేశారు.   

PREV
16
Rakul Preeth Singh: గులాబీ మొగ్గలా ఉండే రకుల్ అగ్గిపుల్లలా అయిపోయిందేంటీ... కారణం అదేనా!
Rakul Preeth Singh


బాలీవుడ్ కి వెళ్లిన రకుల్ చాలా కాలంగా జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది. వ్యాయామం, యోగా తన దినచర్యలో భాగం చేసుకుంది. ప్రతిరోజూ చెమటలు చిందిస్తూ కఠిన కసరత్తులు చేస్తుంది. అందమైన స్లిమ్ అండ్ ఫిట్ బాడీ సాధిస్తుంది. అయితే ఒక దశ వరకూ బరువు తగ్గితే బాగుంటుంది. మరీ సన్నబడినా నేచురల్ లుక్, గ్లో పోతాయి. 

26
Rakul Preeth Singh


రకుల్ లేటెస్ట్ లుక్ అలానే ఉంది. మరీ ముప్పై నలభై కేజీలకు రకుల్ పడిపోయారనిపిస్తుంది. ఆమె రెడ్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఫోటోలు దిగారు. సదరు ఫొటోల్లో రకుల్ లుక్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే బాగా సన్నమై మునుపటి గ్లామర్ కోల్పోయిన భావన కలుగుతుంది. దీంతో... గులాబీ మొగ్గలా ముద్దొచ్చే రకుల్ అగ్గిపుల్లలా అందవిహీనంగా తయారయ్యారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

36
Rakul Preeth Singh

ఇక రకుల్ ఇలా మారిపోవడానికి మితిమీరిన వ్యాయామమే అని తెలుస్తుంది. మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది రకుల్ పెళ్లని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అనూహ్యంగా మరోసారి రకుల్ ఖండించారు. వారానికోసారి నా పెళ్లి వార్తలు వస్తూనే ఉంటాయి. మీ కథనాల ప్రకారం నాకు గత ఏడాది నవంబర్లోనే పెళ్లయిపోయింది. ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో నాకు చెప్పనే లేదూ అంటూ సెటైర్స్ వేసింది. రకుల్ సమాధానాలకు మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు. నేను చాలా బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

46
Rakul Preeth Singh

రకుల్ ప్రీత్ సింగ్ 2021లో ప్రియుడిని పరిచయం చేశారు. నటుడు జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి రకుల్ పై జనాల్లో ఆసక్తి ఎక్కువైంది. మీ వివాహం ఎప్పుడంటూ ప్రతిసారి మీడియా వెంటపడుతుంది. సందర్భం ఏదైనా కానీ మీడియా ముందుకు వస్తే... ఆమె వివాహ ప్రస్తావన తెస్తున్నారు. 
 

56
Rakul Preeth Singh


ఇక రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి హిట్ టాక్ తెచ్చుకుంది. వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఛత్రీవాలి తెరకెక్కింది. రకుల్ ప్రీత్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రయోగాత్మక చిత్రంలో రకుల్ ప్రీత్ నటనతో ఆకట్టుకున్నారన్న మాట వినిపిస్తోంది.

66

ప్రస్తుతం కమల్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో ఓ హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నారు. ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. రకుల్ టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఆమె రీసెంట్ చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు దారులు మూసుకుపోయాయి. అనవసరంగా బాలీవుడ్ కి వెళ్లి రకుల్ సౌత్ లో మార్కెట్ కోల్పోయారు.
 

click me!

Recommended Stories