‘సలార్’ షూటింగ్ పూర్తి చేసుకున్న శృతిహాసన్.. మరీ ప్రభాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడంటే?

First Published | Feb 24, 2023, 11:15 AM IST

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) డార్లింగ్ ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈబ్యూటీ తనవంతు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పై ఎమోషనల్ నోట్ రాసింది.  
 

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’ (Salaar). పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ  హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫస్ట్ టైం డార్లింగ్ సరసన స్టార హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) నటిస్తుండటం విశేషం. 
 

ఇక శృతిహాసన్ ఈఏడాది ఓపెనింగే అందరగొట్టింది. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహాం బాలయ్య సరసన  ‘వీరసింహారెడ్డి’లో నటించి మెప్పించారు. ఈ రెండు చిత్రాలూ  సంక్రాంతికి విడులై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుండటంతో శృతిహాసన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. 
 


ప్రభాస్ -శృతిహాసన్  జంటగా ‘సలార్’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా శృతిహాసన్  పోషించిన ‘ఆద్య’పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్టు పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మరోవైపు శృతిహాసన్ కూడా దర్శకుడు, డీవోపీలతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ తనవంతు పూర్తైందని పేర్కొంది. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
 

‘ఇక నావంతు ‘సలార్’ ముగిసింది. నున్న మీఆద్యగా చేసినందుకు థాంక్యూ ప్రశాంత్ సార్.. మీరు అసాధారణమైనవారు.. ఇక అపూర్వమైన డార్లింగ్ ప్రభాస్ కూ నా కృతజ్ఞతలు.. ఫొటోగ్రఫీ భువన చాలా దయగా, మీలా ఉండటం... హోంబలే ఫిల్మ్స్  టీమ్‌లోని అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో పని చేయడం చాలా బాగుంది. చివరి  వరకూ అందరినీ కుటుంబ సభ్యులలా భావించాను. అందరికీ చాలా కృతజ్ఞతలు. సినిమాతో కలుద్దాం’ అంటూ ఆసక్తికరంగా నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 
  
 

అయితే ‘సలార్’ చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. మరో 30 రోజుల్లో డార్లింగ్ ప్రభాస్ కూడా షూటింగ్ పూర్తి చసుకోనున్నట్టు తెలుస్తోంది.  
 

చిత్రంలో ప్రభాస్ - శ్రుతిహాసన్ జంటగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ లో  ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబర్రూసూర్ సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos

click me!