నా కూతురు కార్తీకకి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి హీరోగా, తండ్రిగా, భర్తగా అన్ని విధాలుగా ఆయన పర్ఫెక్ట్. చిరంజీవి భార్య సురేఖ గారంటే నాకు చాలా గౌరవం. ఆమె ఫ్యామిలీ బాగా చక్కబెడుతారు. చిరంజీవి ఫ్యామిలీతో కూడా చాలా సరదాగా ఉంటారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళితే చిరంజీవి దోసెలు వేస్తూ బిజీగా ఉన్నారు అని రాధ నవ్వుతూ చెప్పింది.