సాధారణంగా సెలెబ్రిటీలు తన పిల్లల ఫోటోలు రివీల్ చేశారు. ఒక వయసు వచ్చే వరకు వాళ్ళను మీడియా కంటపడకుండా దాచి పెడతారు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మరింత జాగ్రత్త పడతారు. అయితే పూర్ణ తన కొడుక్కి ఏడాది నిండకుండానే రివీల్ చేసింది.
26
Purnaa
ఓ పెళ్లి వేడుకకు పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ, కొడుకుతో పాటు హాజరైంది. ఈ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పూర్ణ చేతుల్లో ఉన్న కొడుకు చందమామలా అందంగా ఉన్నాడు. ఫ్యాన్స్ పూర్ణ కొడుకు చాలా అందంగా ఉన్నాడని కొనియాడుతున్నారు.
36
Purnaa
ఈ ఏడాది పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. పూర్ణ కొడుకు పేరు హమ్దాన్ అసిఫ్ అలీ. కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
46
Purnaa
2022లో పూర్ణ గోప్యంగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది. నిశ్చితార్థం విషయం చెప్పి ఆమె వివాహం జరిగిన సంగతి దాచారు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే... ఆల్రెడీ జరిగిపోయిందని వెల్లడించారు.మే 31న షానిద్ తో నిశ్చితార్థం కాగా జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
56
Purnaa
భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దసరా మూవీలో పూర్ణ చిన్న రోల్ చేశారు. నాని హీరోగా తెరకెక్కిన దసరా బ్లాక్ బస్టర్ కొట్టింది.
66
Purnaa
ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.