పెళ్లి తరువాత కొంత కాలం స్క్రీన్ కు దూరం అయిన ప్రియమణి.. ఆతరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను పక్కా ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసింది. వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది హీరోయిన్ ప్రియమణి. ముఖ్యంగా ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్అయ్యింది. ప్రియమణికి మంచి ఇమేజ్ వచ్చింది. వరుస ఆఫర్లను కూడా తీసుకువచ్చింది.